Cricket Match | గ్రామీణ క్రికెటర్లను ప్రోత్సహించడమే టీసీఏ లక్ష్యం…

Cricket Match | గ్రామీణ క్రికెటర్లను ప్రోత్సహించడమే టీసీఏ లక్ష్యం…

  • తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ (టీసీఏ) నిర్మల్ జిల్లా అధ్యక్షులు బాజీరావు

Cricket Match | ముధోల్, ఆంధ్రప్రభ : గ్రామీణ ప్రాంత క్రికెటర్లను ప్రోత్సహించడమే టీసీఏ ప్రధాన లక్ష్యమని తెలంగాణ క్రికెట్ అసోసియేషన్(Cricket Association) (టీసీఏ) నిర్మల్ జిల్లా అధ్యక్షులు బాజీరావు పేర్కొన్నారు. ముధోల్ నియోజకవర్గకేంద్రంలో తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జోనల్ క్రీడా పోటీలు ప్రారంభించారు. ఈ సందర్భంగా తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ (టీసీఏ) నిర్మల్ జిల్లా అధ్యక్షులు బాజీరావు మాట్లాడుతూ… ఈ పోటీలు మూడు రోజులు జరుగుతాయని, ఉత్తమ ప్రదర్శన కనబరిచిన వారిని రాష్ట్రస్థాయిలో ప్రోత్సహిస్తామని తెలిపారు.

మొదటి మ్యాచ్(Match) లో ఆదిలాబాద్ అండ్ మంచిర్యాల టీంలు పోటీపడ్డాయి. ఈ కార్యక్రమానికి తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఎండల లక్ష్మీనారాయణ, ముధోల్ ఎస్సై బిట్ల పెర్సిస్, ముధోల్ సర్పంచ్ షబానా ఇజాజుద్దీన్, ఉప సర్పంచ లావణ్య సాయి, క్రికెటర్ నయీముద్దీన్, కార్యదర్శి తుమ్మల దత్తు, బీజేపీ మండల అధ్యక్షులు పోతన్న, విడిసి కమిటీ సభ్యులు, మాజీ ఎంపీటీసీ మగ్దుమ్, మేరోజ్ ఖాన్, టీసీఏ అభయ్ పటేల్, రోల్ల రమేశ్, క్రీడాకారులు, యువకులు, తదితరులు పాల్గొన్నారు.

Cricket Match |
Cricket Match |

Leave a Reply