Crazy heroines | సంక్రాంతి గ్లామర్ క్వీన్స్..

Crazy heroines | సంక్రాంతి గ్లామర్ క్వీన్స్..
ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : సంక్రాంతి వస్తుందంటే.. సినిమాల పండగ వస్తున్నట్టే. సంక్రాంతికి సినిమా వస్తే.. యావరేజ్ సినిమాలకు(For average movies) కూడా హిట్ అయ్యే ఛాన్స్ ఎక్కువుగా ఉంటాయి. అలాగే కలెక్షన్స్ అయితే.. అంచనాలకు మించి వస్తుంటాయి. అందుకనే.. సంక్రాంతికి తమ సినిమాలను రిలీజ్ చేయడానికి హీరోలు, దర్శకనిర్మాతలు(Heroes and directors) పోటీపడుతుంటారు. ఇదిలా ఉంటే.. సంక్రాంతికి మూడు లేదా నాలుగు సినిమాలు వస్తుంటాయి. ఒక్కోసారి ఐదు రావచ్చు. ఈసారి అంతకు మించి అనేట్టుగా రాబోతున్నాయి. మరీ ముఖ్యంగా ఈసారి సంక్రాంతి సినిమాలతో చాలా ఎక్కువ మంది కథానాయికలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఇంతకీ.. ఎంత మంది కథానాయికలు వస్తున్నారు. ఎవరెవరు వస్తున్నారు…?
Crazy heroines | రాజాసాబ్ తో ముగ్గురు..

ఈ సంక్రాంతికి వస్తున్న ఫస్ట్ మూవీ ది రాజాసాబ్(First movie The Rajasaab). ఈ సినిమాలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తే.. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ మారుతి తెరకెక్కించారు. ఈ సినిమాలో మాళవిక మోహన్, రిద్ది కుమార్, నిధి అగర్వాల్.. నటించారు. ఈ ముగ్గురు కూడా సరైన బ్రేక్ కోసం ఎదురు చూస్తున్నారు. జనవరి 9న ది రాజాసాబ్ మూవీ థియేటర్స్ లోకి భారీ స్థాయిలో(On a massive scale) రాబోతోంది. ఈ సినిమాతో ఈ ముగ్గురు భామలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలి అనుకుంటున్నారు.
Crazy heroines | వరప్రసాద్ తో ఇద్దరు..

ఇక సంక్రాంతికి వస్తున్న మరో భారీ, క్రేజీ మూవీ మన శంకర్ వరప్రసాద్(Shankar Varaprasad) గారు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన సినిమా ఇది. ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ ముఖ్యపాత్ర పోషించడం విశేషం. ఇందులో నయనతార, క్యాధరిన్ నటించారు. నయనతార సౌత్ లేడీ సూపర్ స్టార్(Nayanthara is the South Lady Superstar) గా రాణిస్తున్నారు. క్యాథరిన్ ఈ సినిమాతో సక్సెస్ సాధించి మళ్లీ ఫామ్ లోకి రావాలి అనుకుంటుంది. ఈ చిత్రాన్ని జనవరి 12న రిలీజ్ చేయనున్నారు.
Crazy heroines | మాస్ రాజాతో ఇద్దరు..

ఇక సంక్రాంతికి మాస్ మహారాజా రవితేజ(Mass Maharaja Ravi Teja) కూడా వస్తున్నారు. ఆయన భర్త మహాశయులకు విజ్ఞప్తి అంటూ వస్తున్నారు. ఈ చిత్రాన్ని కిషోర్ తిరుమల తెరకెక్కించారు. ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన పాటలు విశేషంగా ఆకట్టుకుని సినిమా పై మరింతగా బజ్ క్రియేట్ చేశాయి. ఈ మూవీలో డింపుల్ హయతి, ఆషికా రంగనాథ్ నటించారు. ఈ ఇద్దరు భామలు ఈ సినిమాతో బ్లాక్ బస్టర్(Blockbuster with the movie) సాధించి కెరీర్ లో దూసుకెళ్లాలి అనుకుంటున్నారు. ఈ చిత్రాన్ని జనవరి 13న రిలీజ్ చేస్తున్నారు.
Crazy heroines | రాజు కోసం ఇద్దరు రాణులు..

సంక్రాంతికి వస్తున్న మరో సినిమా అనగనగా ఒక రాజు. ఇందులో నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి(Naveen Polishetty, Meenakshi Chowdhury) జంటగా నటించారు. ఈ సినిమాను సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మించారు. ఇందులో అందాల రాశీ ఖన్నా ఓ స్పెషల్ సాంగ్ చేస్తుంది. ఇటీవల ఈ మూవీ నుంచి రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ కి మంచి ఫీడ్ బ్యాక్ వచ్చింది. ఈ సినిమాను జనవరి 14న రిలీజ్ చేయనున్నారు. మీనాక్షి సంక్రాంతికి వస్తే.. హిట్టే. అందుచేత సక్సెస్ పై చాలా నమ్మకంగా ఉన్నారు. రాశీ ఈ సినిమాతో ఫామ్ లోకి రావాలి అనుకుంటుంది.
Crazy heroines | సంయుక్త, సాక్షి నడుమ శర్వా..

శర్వానంద్ గత కొంతకాలంగా సరైన సక్సెస్ కోసం(For proper success) తపిస్తున్నాడు. అయితే.. సంక్రాంతి శర్వాకు బాగా కలిసొచ్చింది. ఎక్స్ ప్రెస్ రాజా, శతమానం భవతి సినిమాలు సంక్రాంతికి వచ్చి బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. అందుకనే ఈసారి సంక్రాంతికి నారీ నారీ నడుమ మురారి అనే సినిమాతో వస్తున్నాడు. ఈ సినిమాలో సంయుక్త మీనన్, సాక్షి వైద్య(Samyukta Menon, Sakshi Vaidya) నటించారు. ఈ సినిమాను జనవరి 14న రిలీజ్ చేయనున్నారు. సంయుక్త బాగానే రాణిస్తుంది కానీ.. సాక్షి వైద్య బ్రేక్ కోసం చూస్తుంది. ఈ సినిమా పై చాలా ఆశలు పెట్టుకుంది. ఇలా సంక్రాంతికి వస్తున్న సినిమాలతో ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా 11 మంది హీరోయిన్స్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. మరి.. ఈ 11 మంది హీరోయిన్స్ లో ఎవరు సంక్రాంతికి బాగా సందడి చేసి సంక్రాంతి భామ(Sankranthi Bhama made a fuss) అనిపించుకుంటారో బ్లాక్ బస్టర్ సాధిస్తారో చూడాలి.
