CPI Centenary | ఉత్సవాలను జయప్రదం చేయాలి

CPI Centenary | ఉత్సవాలను జయప్రదం చేయాలి

  • సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి ఎంఏ రెహమాన్

సంగారెడ్డి ప్ర‌తినిధి, ఆంధ్ర‌ప్ర‌భ : ఖమ్మంలో ఈ నెల 18న జరగనున్న భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) శతాబ్ది ఉత్సవాల భారీ బహిరంగ సభ గోడపత్రికను మునిపల్లి మండలంలోని బుదేరా గ్రామంలో ఆవిష్కరించారు. ఈసందర్భంగా సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి ఎంఏ రెహమాన్ మాట్లాడుతూ… భారత కమ్యూనిస్టు పార్టీ సీపీఐ 100 సంవత్సరాల ప్రస్థానంలో అనేక పోరాటాలు, ఉద్యమాలు నిర్వహిస్తూ దేశ స్వాతంత్ర్య ఉద్యమంలో తెల్లదొరల పాలనకు వ్యతిరేకంగా విరోచితంగా పోరాడిందన్నారు.

తెలంగాణ సాయుధ పోరాటాన్ని నడిపి దొరల పాలనను తరిమికొట్టిన ఘనత కమ్యూనిస్టు పార్టీదేనని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలోనూ సీపీఐ కీలక పాత్ర పోషించిందని, కార్మికులు, కర్షకులు, పేద ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం ఉద్యమించే పార్టీ సీపీఐ అని వివరించారు. పార్టీ శతాబ్ది ఉత్సవాల ముగింపు సందర్భంగా జనవరి 18న ఖమ్మంలో నిర్వహించనున్న బహిరంగ సభకు దేశ, విదేశాల నుంచి కమ్యూనిస్టు పార్టీల అగ్ర నాయకులు హాజరుకానున్నారని తెలిపారు.

ఈ బహిరంగ సభకు పార్టీ కార్యకర్తలు, సానుభూతిపరులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని సభను జయప్రదం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి వెంకటరాజ్యం, సీపీఐ నాయకులు చింత గంగ, తిరుమలేష్, నర్సింలు, మొగులయ్య, అంబయ్య, సంజీవ్, ఆజు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply