ADB | కలెక్టరేట్, ఆర్డీఓ కార్యాలయాల స్వాధీనానికి కోర్టు ఆదేశాలు !

నిర్మల్ ప్రతినిధి, (ఆంధ్రప్రభ) : జిల్లా కలెక్టరేట్, ఆర్డీఓ కార్యాలయ భవనాలను స్వాధీనం చేసుకోవాలని నిర్మల్ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. 1999లో గడ్డెన్న, శ్రీరాంసాగర్‌ రిజర్వాయర్‌లో భూములు కోల్పోయిన బాధితులకు పరిహారం చెల్లింపులో జాప్యం జరగడంతో… ప్రభుత్వం ఈ కార్యాలయాలకు ఉత్తర్వులు జారీ చేసింది.

కలెక్టరేట్‌ నుంచి రూ.6,79,63,102 కోట్లు, ఆర్డీఓ నుంచి రూ.1,45,46,927 కోట్లు పరిహారం రావాల్సి ఉందని సీనియర్‌ సివిల్‌ జడ్జి శ్రీనివాస్‌ కార్యాలయాల స్వాధీనం కోసం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు కోర్టు అధికారులు మంగళవారం కార్యాలయాలకు నోటీసులు అందజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *