Sangareddy | ప్రేమజంట‌కు క‌త్తిపోట్లు.. స్పాట్ లో ప్రియురాలు మృతి

ప‌ఠాన్ చెరు : ప్రేమకోసం ప్రాణాలు తీయడం లేదా ఆత్మహత్యలు చేసుకోవడం వంటి ఘటనలు ఇటీవల ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయి. తాజాగా సంగారెడ్డి (Sangareddy) జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఓ ప్రేమ జంట అనుమానాస్పద స్థితిలో ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటనలో ప్రియురాలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన రామచంద్రపురం (Ramachandrapuram) పి యస్ పరిధిలోని బండ్లగూడ బాలాజీనగర్ లో చోటుచేసుకుంది. చనిపోయిన యువతిని రమ్యగా గుర్తించారు. అపస్మారక స్థితిలో ఉన్న ప్రియుడు ప్రవీణ్ ను ఆస్పత్రికి తరలించారు.

మృతురాలు రమ్య (Ramya) డిగ్రీ చదువుతోంది. కొంతకాలంగా ఆకుల ప్రవీణ్ (Praveen) తో ప్రేమలో ఉన్నట్లు సమాచారం. అయితే కొన్ని రోజులుగా ఏవో కారణాలతో ఇద్దరిమధ్య గ్యాప్ ఏర్పడ్డట్టు సమాచారం. ఈ నేపథ్యంలో యువతి ఇంట్లో గొంతుపై కత్తి గాట్లతో రక్తపు మడుగులో పడి ఉన్నారు యువతి, యువకుడు. స్పాట్ లోనే రమ్య మృతిచెందగా, అపస్మారక స్థితిలో ప్రవీణ్ ఉండటంతో ఆస్పత్రికి తరలించారు. రమ్య మెడపై కత్తితో దాడి చేసి అనంతరం ప్రవీణ్ ఆత్మహత్య చేసుకున్నాడా? లేదా ఇద్దరు ఆత్మహత్యకు పాల్పడ్డారా అని తెలియాల్సి ఉంది. కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించడంతో ఆర్సీపురం పోలీసులు అక్కడికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కూతురు మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

Leave a Reply