Couple friendly | ట్రైలర్ రిలీజ్..

Couple friendly | ట్రైలర్ రిలీజ్..

  • కపుల్ ఫ్రెండ్లీ మూవీ ట్రైలర్ కు పాజిటివ్ రెస్పాన్స్
  • మ్యూజికల్ రొమాంటిక్ లవ్ స్టోరీగా కపుల్ ఫ్రెండ్లీ
  • మిత్ర క్యారెక్టర్ పై మానస వారణాసి కామెంట్స్
  • యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో సంతోష్ శోభన్ మూవీ
  • వాలెంటైన్స్ డే కానుకగా థియేట్రికల్ రిలీజ్

Couple friendly | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : సంతోష్ శోభన్ హీరోగా నటించిన సినిమా కపుల్ ఫ్రెండ్లీ. ఈ చిత్రంలో మానస వారణాసి హీరోయిన్ గా నటించింది. ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో గ్రాండ్ గా నిర్మిస్తోంది. అజయ్ కుమార్ రాజు.పి కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి అశ్విన్ చంద్రశేఖర్ దర్శకత్వం వహించారు. మ్యూజికల్ రొమాంటిక్ లవ్ స్టోరీ గా తెరకెక్కిన కపుల్ ఫ్రెండ్లీ సినిమా వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ నెల 14న తెలుగు, తమిళంలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా ఈ మూవీ ట్రైలర్ ను హైదరాబాద్ లో గ్రాండ్ ఈవెంట్ లో లాంఛ్ చేశారు.

Couple friendly

Couple friendly | ఈ కార్యక్రమంలో హీరోయిన్ మానస వారణాసి మాట్లాడుతూ..

“కపుల్ ఫ్రెండ్లీ” చిత్రంలో మిత్ర అనే క్యారెక్టర్ లో నటించాను. ఇలాంటి బ్యూటిఫుల్ క్యారెక్టర్ లో నటించే అవకాశం దక్కడం సంతోషంగా ఉంది. మిత్ర క్యారెక్టర్ తో నేను పర్సనల్ గా బాగా కనెక్ట్ అయ్యాను. ఈ పాత్ర కూడా నాలాగే లైఫ్ లో ఏదైనా చేయాల్సివస్తే ముందు యాక్షన్ (Action) లోకి దిగేస్తుంది. ఎలాంటి డౌట్స్ పెట్టుకోదు. ఈ సినిమా ఒక రోలర్ కోస్టర్ రైడ్ లాంటిది. చెన్నై బ్యాక్ డ్రాప్ లో సాగే ఫ్రెష్, యంగ్ లవ్ స్టోరీ. మేము చెన్నైలోని అనేక ప్రాంతాల్లో గెరిల్లా టైప్ లో షూటింగ్ చేశాం.

సంతోష్ శోభన్ చాలా మంచి యాక్టర్. ఆయన డెడికేషన్, ప్రతి సీన్ లో ఇంకా బాగా నటించాలనే తపన చూశాను. నేను ఆయన నుంచి నేర్చుకున్నా. ఆదిత్య (Adithya) బ్యూటిఫుల్ మ్యూజిక్ ఇచ్చారు. రెండు సాంగ్స్ రిలీజ్ అయ్యి ఛాట్ బస్టర్స్ అయ్యాయి. నా ఫేవరేట్ సాంగ్స్ ఇంకా రిలీజ్ చేయాల్సిఉంది. మా సినిమాను ధీరజ్ గారు డిస్ట్రిబ్యూట్ చేయడం హ్యాపీగా ఉంది. ఆయన ప్రొడ్యూస్ చేసిన ది గర్ల్ ఫ్రెండ్ సినిమా నా ఫేవరేట్ మూవీ. కపుల్ ఫ్రెండ్లీ సినిమా కపుల్స్ కోసమే కాదు సింగిల్స్ కోసం.. ఫ్యామిలీ ఆడియెన్స్ కోసం.. ఈ నెల 14న థియేటర్స్ లోకి వస్తోంది. మీరంతా చూసి ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను అన్నారు.

Couple friendly

Couple friendly | హీరో సంతోష్ శోభన్ మాట్లాడుతూ..

యూవీ క్రియేషన్స్ నా ఫ్యామిలీ లాంటిది. ఈ బ్యానర్ లో వచ్చే ప్రతి సినిమా మాది అనుకుంటాం. డైరెక్టర్ అశ్విన్ చంద్రశేఖర్ చేయబోయే ఎన్నో మంచి చిత్రాల్లో మొదటిదిగా కపుల్ ఫ్రెండ్లీ రిలీజ్ కు (Release) వస్తోంది. ప్రపంచ వేదిక పై మన దేశానికి ప్రాతినిధ్యం వహించి పేరు తీసుకొచ్చింది మానస వారణాసి. ఆమెతో కలిసి ఈ సినిమాలో నటించడం హ్యాపీగా ఉంది. మా సినిమాలో మిత్ర క్యారెక్టర్ ను ఆమె కంటే బెటర్ గా ఎవరూ చేయలేరేమో అనిపించింది. మా అజయ్ అన్నకు థ్యాంక్స్. ధీరజ్ గారు మా మూవీని రిలీజ్ చేస్తున్నారంటే మా టీమ్ అందరిలో పది రెట్లు ఉత్సాహం వచ్చింది.

నేను చిన్న గ్యాప్ తీసుకున్న మాట నిజమే. ఈసారి నేను చూపించబోయే కథ ఇరవై ఏళ్ల పాటు మీకు గుర్తుండిపోవాలి అనుకుని ఈ సినిమా చేశాను. శివ (Siva) అనే క్యారెక్టర్ కు ఒక జర్నీ ఉంటుంది. ఆ జర్నీలో మూడు డిఫరెంట్ లుక్స్ లో కనిపిస్తా. శివ నెల్లూరు నుంచి వచ్చిన అబ్బాయి, మిత్ర చిత్తూరు నుంచి వస్తుంది. వాళ్లు చెన్నైలో కలుస్తారు. చెన్నైలో షూటింగ్ చేయడం బ్యూటిపుల్ ఎక్సిపీరియన్స్ ఇచ్చింది. శివ, మిత్ర అనే పాత్రలు మిమ్మల్ని నవ్విస్తాయి, కదిలిస్తాయి. కాస్త ఏడిపిస్తాయి. కపుల్ ఫ్రెండ్లీ ఒక జెన్యూన్ ఇంటెన్షన్ తో, హానెస్ట్ గా చేసిన సినిమా. ఇది నా కెరీర్ లో గుర్తుండిపోయే మూవీ అవుతుంది అన్నారు.

Couple friendly

CLICK HERE TO READ లవ్ స్టోరీ బయటపెట్టిన మృణాల్ ఠాగూర్.. ప్రేమలో ఫెయిల్ అయ్యిందా?

CLICK HERE TO READ MORE

Leave a Reply