Counting day |ఎపిలోని 3 ఎమ్మెల్సీ స్థానాలకూ ఓట్ల లెక్కింపు ప్రారంభం

వెలగపూడి – ఆంధ్రప్రదేశ్‌లో..ఆంధ్రప్రదేశ్‌లోని 3 ఎమ్మెల్సీ స్థానాలకూ ఉదయం ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ నియోజకవర్గ ఓట్ల లెక్కింపు విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీలో, ఉభయగోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గానిది ఏలూరు సమీపంలోని వట్లూరు సీఆర్‌ఆర్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో, కృష్ణా-గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గ ఓట్ల లెక్కింపు గుంటూరు ఏసీ కాలేజీలో లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. కౌంటింగ్‌ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత ఏర్పాటుచేశారు. ఉమ్మడి తూర్పు-పశ్చిమగోదావరి పట్టభద్రుల స్థానానికి అత్యధికంగా 35 మంది, కృష్ణా-గుంటూరు స్థానానికి 25 మంది, ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ స్థానానికి పదిమంది పోటీలో ఉన్నారు.

ఇక, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి పట్టభద్రుల నియోజకవర్గాల్లో 63.28 శాతం, కృష్ణా, గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గాల్లో 65.58 శాతం, శ్రీకాకుళం –విజయనగరం, విశాఖపట్నం ఉపాధ్యాయుల నియోజకవర్గంలో 91.82 శాతం ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ మూడు ఎమ్మెల్సీ స్థానాలకు 70 మంది అభ్యర్థులు బరిలో ఉన్నప్పటికీ రెండు పట్టభద్రుల నియోజకవర్గాల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ, పీడీఎఫ్‌ అభ్యర్థుల మధ్యే ప్రధాన పోటీ నెలకొంది.

ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ నియోజకవర్గంలో 10 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. కానీ పీఆర్‌టీయూ అభ్యర్థి గాదె శ్రీనివాసులు నాయుడు, ఎన్డీఏ మద్దతుతో ఏపీటీఎఫ్ అభ్యర్థి పాకలపాటి రఘువర్మ, యూటీఎఫ్ అభ్యర్థి కోరెడ్ల విజయగౌరి మధ్య పోరు నెలకొంది. ఈ త్రిముఖ పోటీలో గెలుపు ఎవరిదో.. సస్పెన్స్ నెలకొంది.

. కృష్ణాగుంటూరు పట్టభద్రుల నియోజకవర్గంలో ఎన్డీయే అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, పీడీఎఫ్ అభ్యర్థి లక్ష్మణరావు మధ్యే పోటీ కనిపిస్తోంది. ఈ స్థానంలో 25 మంది అభ్యర్థులు ఉన్నప్పటికీ ఇద్దరి మధ్యేగట్టి పోటీ తప్పలేదు. ఈ నియోజకవర్గంలో వైసీపీ కేడర్ లక్ష్మణరావుకే తమ మద్దతు ప్రకటించారు. ఇక గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గంలోనూ ఎన్నికల రసవత్తరంగా జరిగింది. ఉమ్మడి గోదావరి జిల్లాల పట్టభద్రుల స్థానంలో మొత్తం 35 మంది బరిలో ఉన్నారు. వీరిలో టీడీపీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్‌, పీడీఎఫ్‌ అభ్యర్థి డీవీ రాఘవులు, స్వతంత్ర అభ్యర్థిగా మాజీ ఎంపీ హర్షకుమార్ తనయుడు జీవీ సుందర్ పోటీపడ్డారు

Leave a Reply