Countdown | ప్రతీకారం తీర్చుకోవడానికి ప్లాన్ రెడీ? మోదీతో రక్షణ శాఖ కార్యదర్శి భేటీ

న్యూఢిల్లీ, ఆంధ్ర‌ప్ర‌భ : పహల్గాం టెర్రర్ అటాక్ నేపథ్యంలో భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దాయాది గత 11 రోజులుగా ఎల్‌వోసీ వెంట కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. జమ్మూకశ్మీర్‌లోని కుప్వారా, బారాముల్లా, పూంచ్, రాజౌరి, మెంధార్, నౌషేరా, సుందర్‌బాని, అఖ్నూర్‌లో ఉన్న భారత పోస్టుల‌పై కాల్పులకు తెగబడగా భద్రతా బలగాలు ధీటుగా బదులిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీ, రక్షణ శాఖ కార్యదర్శి రాజేష్ కుమార్‌తో భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇప్పటికే త్రివిధ దళాధిపతులతో సమావేశమైన కీలక విషయాలను అడిగి తెలుసుకున్నారు. పాక్‌పై సైనిక చర్యకు తాము ఏ క్షణమైనా సిద్ధంగా ఉన్నామని త్రివిధ దళాధిపతులు ప్రధానికి స్పష్టం చేశారు.

పాక్ ఆర్థిక‌, ఉగ్ర మూలాలే టార్గెట్‌
మరోవైపు పాక్ ఆర్థిక, ఉగ్ర మూలాలే టార్గెట్‌గా భారత్ పావులు కదుపుతోంది. ఉగ్రవాదంపై పోరులో ప్రపంచానికి సందేశమిచ్చేలా వ్యూహ్యాన్ని సిద్ధం చేస్తోంది. దేశ సైనిక సన్నద్ధతతో పాటు ఆర్థిక, రాజకీయ అంతర్జాతీయ పరిణామాలపై కేంద్ర ప్రభుత్వం ప్రధానంగా దృష్టి పెట్టింది. ఇప్పటికే పాక్ ఆర్థిక వ్యవస్థను దెబ్బకొట్టేలా దౌత్య, వ్యాపార, వాణిజ్య, జలాలపై భారత్ నిషేధం విధించిన విషయం తెలిసిందే.

Leave a Reply