కుంటాల అంబులెన్స్ ఆకస్మితక తనిఖీ

కుంటాల అంబులెన్స్ ఆకస్మితక తనిఖీ

అంబులెన్స్ సేవలపై వివరాల అడిగి తెలుసుకుని రికార్డులను పరిశీలించిన అధికారులు

కుంటాల ఆంధ్రప్రభః కల్లూరు లో గల అంబులెన్స్ ను ఆకస్మితి తనిఖీ బుధవారం నిర్వహించారు ఈ సందర్భంగా తనిఖీ చేసిన వారిలో 108 ప్రోగ్రామ్ మేనేజర్ జనార్ధన్ మరియు నిర్మల్ జిల్లా EME లింగా చారి . ఆకస్మిక తనిఖీ చేసి అంబులెన్స్ యొక్క రికార్డులను పరిశీలించారు. ప్రజలకుప్రథమ చికిత్స ఎలా అందించాలో 108 సిబ్బందికి వివరించారు.

ప్రతి అంబులెన్స్ లో ఆక్సిజన్, ఫార్మలాజికల్ మెడిసిన్, ఎక్విప్మెంట్స్ అన్నీ అందుబాటులో ఉంచాలని. మారుమూల గ్రామాలకు కూడా, సాధ్యమైనంతవరకు ప్రజలకు తొందరగా వెళ్లాలని,108 ప్రజలకు 24 గంటలు మెరుగైన సేవలు అందించాలని అంబులెన్స్ కు సమాచారం అందిన వెంటనే క్షణంలో అక్కడికి వెళ్లాలని వారికి సూచించారు విధులు నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు పలు సూచనలను ఇచ్చారు ఈ కార్యక్రమంలో సిబ్బంది emt నర్సయ్య, పైలట్ విజయ్ , గజేందర్ పాల్గొన్నారు.

Leave a Reply