వరంగల్ ఆర్వో కార్యాలయంలో అవినీతి కలకలం

వరంగల్, ఆంధ్రప్రభ ; వరంగల్ ఆర్వో సబ్ రిజిస్ట్రార్-1 జమలాపురి రామనర్సింహారావును సస్పెండ్ చేస్తూ కమిషనర్ రాజీవ్ంధీ హన్మంతు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్వర్వులు సోమవారం వరంగల్ కార్యాలయానికి చేరుకోనున్నాయి. ఈ నెల 3న అవినీతి నిరోధక శాఖ అధికారులు వరంగల్ ఆర్వో కార్యాలయం మీద దాడులు చేసి అక్రమ రిజిస్ట్రేషన్లు, అక్రమ ఆస్తులను గుర్తించారు.

అవినీతికిపాల్పడినందుకుగాను సబ్ రిజిస్ట్రార్-2 ఆనంద్ను ఇప్పటికే సస్పెండ్ చేశారు. రామనర్సింహారావుపై చర్యల కోసం డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ జనరల్ సుభాషిణి కమిషనర్కు సమర్పించారు. ఆయనపై ఈ నెల 10న చర్యలు తీసుకున్నారు. కానీ సెలవులు రావడంతో ఉత్తర్వులు ఇంకా వరంగల్ కార్యాలయానికి అందలేదు.

వరంగల్ఆర్వో కార్యాలయంలో ఏక కాలంలో ఇద్దరు సబ్ రిజిస్ట్రార్లు అవినీతికి పాల్పడటం, అక్రమ ఆస్తులు కలిగి ఉండటం సంచలనం కలిగించింది. రామనర్సింహారావు, ఆనంద్ కు మధ్య ఆన్లైన్లో రూ.43 లక్షల లావాదేవీలు జరిగినట్లు అవినీతి నిరోధక శాఖ గుర్తించిన విషయం తెలిసిందే.

Leave a Reply