ఆర్యవైశ్యులకు ఇచ్చిన హామీలన్నీ అమలు చేసే దిశగా ప్రభుత్వం…

ఆర్యవైశ్యులకు ఇచ్చిన హామీలన్నీ అమలు చేసే దిశగా ప్రభుత్వం…

  • ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్యవైశ్య డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డూండీ రాకేష్

కేదారేశ్వరపేట, ఆంధ్రప్రభ : ఆర్యవైశ్యులకు రాజకీయంగా సమూచిత ప్రాధాన్యం కల్పించే దిశగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని ఆర్యవైశ్య డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్ పేర్కొన్నారు. ఈ మేరకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తమకు ఇచ్చిన హామీని నెరవేర్చే దిశగా పని చేస్తున్నారని అన్నారు. ఇవి సాధించేందుకు ఆర్యవైశ్యుల అంతా సంఘటితం కావాలని పిలుపునిచ్చారు. వాసవి జాగృతి ఇంటర్నేషనల్ రెండవ వార్షికోత్సవ వేడుకలు విజయవాడ తుమ్మలపల్లి కళక్షేత్రంలో ఘనంగా జరిగాయి.

ఈ సందర్భంగా విజయభేరీ పేరిట ఏర్పాటైన సభలో ఆర్యవైశ్య డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డుండి రాకేష్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాసవి జాగృతి ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో ఆర్యవైశ్యుల విజయభేరీ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఆర్యవైశ్యలు చేస్తున్న సామాజిక సేవ కార్యక్రమాలు ప్రశంసనీయమని కొనియాడారు. ఆర్యవైశ్యులకు రాజకీయంగా సముచిత ప్రాధాన్యం కల్పించే దిశగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని స్పష్టం చేసారు.

ఈ మేరకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తమకు ఇచ్చిన హామీని నెరవేర్చే దిశగా పని చేస్తున్నారని అన్నారు. ఇవి సాధించుకునెందుకు ఆర్యవైశ్యుల అంతా సంఘాటీతం కావాలని పిలుపునిచ్చారు. వాసవి జాగృతి ఇంటర్నేషనల్ వ్యవస్థాపక అధ్యక్షులు తిరువీధి వేణుగోపాల్ మాట్లాడుతూ సేవ, స్నేహం, నాయకత్వం, వ్యాపారం వంటి నాలుగు అంశాలతో ఏర్పాటైన వాసవి జాగృతి ఇంటర్నేషనల్ దిగ్విజయంగా ముందుకు సాగుతుందన్నారు.

తమ సంస్థ ఆధ్వర్యంలో కులమతాలకు అతీతంగా సామాజిక సేవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. ఆంధ్ర తెలంగాణ సహా రాష్ట్రాలకు చెందిన 2300 మంది సభ్యులతో శ్రమదానం, పల్లెకు పోదాం చలో ఛలో, విందు వినోదం, జై జవాన్ వంటి అనేక కార్యక్రమాలు చేస్తున్నామని తెలిపారు. వాసవి జాగృతి అంతర్జాతీయ సదస్సును పురస్కరించుకొని నూతన ప్రాజెక్టు లతో సేవ కార్యక్రమాలు చేస్తున్నామాని వివరించారు.

అనంతరం వాసవి జాగృతి ఇంటర్నేషనల్ జాయింట్ సెక్రెటరీ, ఐకానిక్ కమిటీ చైర్మన్ దారా కరుణశ్రీ మాట్లాడుతూ ఆర్య వైశ్యులు సేవ భావానికి ప్రతికలని అన్నారు. తమ ఆదాయంలో కొంతబాగాన్ని సేవ కార్యక్రమాలకు వినియోగిస్తూ సేవా తత్పరత చాటుకుంటున్నారని వెల్లడించారు. పేద విద్యార్థులకు స్కాలర్షిప్లు అందిస్తున్నామని సహాయం అవసరమైన ఎవరైనా తమను సంప్రదించాలని సూచించారు. ఈ సందర్భంగా వాసవి జాగృతి విజయబేరిని పురస్కరించుకొని వాసవి జాగృతి మహిళలు నిర్వహించిన కార్యక్రమాలు అహుతులను అలరించాయి.

ఈ కార్యక్రమంలో సంస్థ ఫస్ట్ లేడీ తిరువిధి వరలక్ష్మి, ఉపాధ్యక్షులు నాగసూర్య మురళి మోహన్ రావు, కార్యదర్శి నాదేళ్ల శ్రీనివాసులు, కోశాధికారి సుంకు చంద్రశేఖర్ గుప్తాతో పాటు ఐకానిక్ కమిటీ కో- చైర్మన్లుఆలమూరి అమరనాధ్, ఊటుకూరి కిరణ్ కుమార్, అప్పన్న సత్యసాయిబాబు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply