ఆపరేషన్ “వజ్రప్రహార్” లో భాగంగా కార్డన్ అండ్ సర్చ్ నిర్వహణ…

ఆపరేషన్ “వజ్రప్రహార్” లో భాగంగా కార్డన్ అండ్ సర్చ్ నిర్వహణ…

నేర నియంత్రణకు,మాదక ద్రవ్యాల నియంత్రణకు ఈ కార్డన్ &సెర్చ్ తనిఖీలు…

నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, ఆదేశముల మేరకు ఈగల్ చీఫ్ ఆకే రవి కృష్ణ, పర్యవేక్షణలో, జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ ఉత్తర్వుల మేరకు ఆత్మకూరు సబ్ డివిజన్ డీస్పీ రామంజి నాయక్ ఆద్వర్యంలో శనివారం మాదకద్రవ్యాల నియంత్రణకు చేపట్టిన ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఆపరేషన్ వజ్రప్రహార్ లో భాగంగా అమలాపురం,కృష్ణపురం మొదలగు ప్రాంతాలలో పోలీసు సిబ్బందితో నేడు కార్డన్ సెర్చ్ ఆపరేషన్ విస్తృతంగా నిర్వహించరు.

డి ఎస్ పి మాట్లాడుతూ నేరగాళ్ల కదలికలను కనిపెట్టేందుకు, మారుమూల ప్రాంతాలను తనిఖీ చేసేందుకు ఈ ఆపరేషన్‌ నిర్వహించడం జరిగిందన్నారు. అనుమానితులు ,నేరచరిత్ర గలవారి ఇళ్ళలో తనిఖీలు చేపట్టారు. ముఖ్యంగా మాదకద్రవ్యాల వినియోగం జరుగుతున్నట్లు అనుమానం ఉన్న ప్రాంతాలు, అద్దె ఇళ్లు, ఖాళీ భవనాలు, ఇతర అనుమానాస్పద ప్రదేశాలలో పోలీసులు సోదాలు నిర్వహించామన్నారు. రౌడీ షీటర్లు, సస్పెక్ట్ షీట్లు ఉన్న వ్యక్తులను పిలిపించి వారికి కౌన్సెలింగ్ నిర్వహించి వారికీ సత్ప్రవర్తనతో మెలగాలని సూచించారు.

అనంతరం ప్రజలతో సమావేశం నిర్వహించి నేర నియంత్రణకు మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే ఆరోగ్య, సామాజిక, చట్టపరమైన దుష్పరిణామాల గురించి అవగాహన కల్పించారు. గంజాయి, ఇతర మాదకద్రవ్యాల వినియోగం యువత భవిష్యత్తును నాశనం చేస్తుందని, కుటుంబ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుందని వివరించారు. ప్రజలు తమ పరిసర ప్రాంతాల్లో గంజాయి లేదా ఇతర మాదకద్రవ్యాలకు సంబంధించిన సమాచారం ఉంటే వెంటనే ఏపీ, ఈగల్ టోల్ ఫ్రీ నెంబర్ 1972 కు సమాచారం అందించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.

సమాచారం ఇచ్చే వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో పోలీసు అధికారులు, సిబ్బంది, ప్రజలతో కలిసి “ఆపరేషన్ వజ్రప్రహార్ ప్రతిజ్ఞ” నిర్వహించి మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా పోరాడాలని ప్రతిజ్ఞ చేశారు. సమాజాన్ని డ్రగ్స్ రహితంగా మార్చడంలో ప్రజల సహకారం ఎంతో ముఖ్యమని ఈ సందర్భంగా అధికారులు పేర్కొన్నారు. కార్యాక్రమంలో ఆత్మకూరు టౌన్, రూరల్ ఇన్స్పెక్టర్లు మహేశ్వర్ రెడ్డి, సురేశ్ కుమార్ రెడ్డి, నారాయణ రెడ్డి పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply