ఆలయ అభివృద్ధికి సహకరించండి

ఆలయ అభివృద్ధికి సహకరించండి

  • మంత్రి నారా లోకేష్ కు ఎమ్మెల్యే బొజ్జల వినతి

ఏర్పేడు, ఆంధ్రప్రభ : క్రీస్తుపూర్వం రెండు మూడు శతాబ్దాల(Centuries) కిందట నిర్మితమైన భారత దేశం(India)లో తొలి శివాలయం గుడిమల్లం శ్రీ ఆనంద వల్లి సమేత శ్రీ‌ పరశురామేశ్వర స్వామి(Sri Parashurameshwara Swamy) ఆలయ అభివృద్ధికి సహకరించాల్సిందిగా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి రాష్ట్ర మంత్రి నారా లోకేష్(State Minister Nara Lokesh)కు విన్నవించారు.

ఆలయం చరిత్ర గురించి బుక్ లెట్‌ను నారా లోకేష్‌కు అందించిన ఎమ్మెల్యే బొజ్జల(Bojjala) ఆలయ ప్రాశస్త్యం గురించి వివరించారు. ఆలయం అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని ఆలయాన్నిమరింత అభివృద్ధి చేస్తామని నారా లోకేష్ ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డికి(Sudheer Reddy) హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన ఆలయ చరిత్ర గురించి ఉన్నపుస్తకాన్నిక్షుణ్ణంగా పరిశీలించారు.

Leave a Reply