ఉమ్మడి ఆదిలాబాద్ బ్యూరో, ఆంధ్రప్రభ : అదిలాబాద్ జిల్లా సోనాల మండలం కౌట కె గ్రామానికి చెందిన మారుతి అనే ఇందిరమ్మ లబ్ధిదారున్ని కాంట్రాక్టర్ చెట్టుకు కట్టేసి గొడవకు దిగిన సంఘటన కలకలం రేపింది. చింతల్ బోరి గ్రామానికి చెందిన సత్యనారాయణ అనే ఓ కాంట్రాక్టర్ కౌట కే గ్రామంలో దాదాపు 20 ఇందిరమ్మ ఇండ్లు నిర్మించేందుకు గుత్తేదారుగా ఒప్పందం చేసుకున్నాడు.
అయితే బేస్మెంట్ దశలో ఒక లక్ష రూపాయలు లబ్ధిదారుడు మారుతి అకౌంట్లో పడగా, ఆ అమౌంట్ కాంట్రాక్టర్ కు ఇవ్వకుండా మారుతి తప్పించుకు తిరిగాడు. అయితే లబ్ధిదారుడు మంగళవారం గుత్తేదారుకు కంటపడగానే సోనాల మండల కేంద్రంలోని ఓ చెట్టుకు కట్టేసి అకౌంట్ లో పడ్డ బిల్లు డబ్బులు ఇవ్వాలంటూ నిలదీశాడు. అనంతరం పోలీసులు అక్కడికి చేరుకొని ఇద్దరిని పిలిపించి ఇద్దరి మధ్య వివాదాన్ని పరిష్కరించడం గమనార్హం.

