వాజేడు, ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : ఛత్తీస్‌గడ్ (Chhattisgarh) రాష్ట్రం నుంచి తెలంగాణ (Telangana) రాష్ట్రానికి వస్తున్న కంటైనర్ ములుగు జిల్లా (Mulugu district) వాజేడు మండల పరిధిలోని టేకులగూడెం గ్రామం వద్ద ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదం(accident)లో బైక్ నడుపుతున్న చందుపట్ల గ్రామానికి చెందిన పాయల రాంబాబు అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. అతని రెండు చేతులు విరిగిపోవడంతో వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి (Warangal MGM Hospital) తరలించారు. ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టిన కంటైనర్ ( container) ను పేరూరు ఎస్సై గుర్రం కృష్ణ ప్రసాద్ ఆధ్వర్యంలో స్వాధీనం చేసుకున్నారు.
వ్యక్తికి తీవ్ర గాయాలు…

