construction | రోడ్డు వెడల్పు, డ్రైనేజీ నిర్మాణం పై గ్రామ సభ….

construction | రోడ్డు వెడల్పు, డ్రైనేజీ నిర్మాణం పై గ్రామ సభ….
construction | చందూర్, ఆంధ్ర ప్రభ : చందూర్ గ్రామంలోని ప్రధాన బస్టాండ్ నుండి నిజాంసాగర్ కెనాల్ వరకు రోడ్డు వెడల్పు, రోడ్డుకు ఇరు వైపుల నూతన డ్రైనేజీ నిర్మించడంపై స్థానిక గ్రామపంచాయతీ నందు గ్రామ సభ నిర్వహించారు.
గ్రామంలోని ప్రజాప్రతినిధులు, నాయకులు అన్ని కుల సంఘాల పెద్దలు, యువకులు పాల్గొన్న ఈసమావేశంలో రోడ్డుకు రెండువైపులా 30-30 ఫీట్ల(30-30 feet)తో వెడల్పు, డ్రైనేజీ నిర్మాణం(drainage construction) చేయడానికి తీర్మానం ప్రవేశపెట్టగా, మెజారిటీ ప్రజల అభిప్రాయం మేరకు గ్రామ సభ తీర్మానం ఆమోదం పొందింది. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్, గ్రామపంచాయతీ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.
