Constituency |గ్రామాభివృద్ధి కోసం ముందుంటా
- ఆకులతండ సర్పంచ్ అభ్యర్థి కూకట్ల రవి, బిఆర్ఎస్
Constituency |నర్సంపేట రూరల్, ఆంధ్రప్రభ : గ్రామాభివృద్ధి కోసం ముందుంటానని ఆకులతండ గ్రామ ప్రజలకు ఏ కష్టం వచ్చినా.. అండగా ఉంటానని బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి కూకట్ల రవి హామీ ఇచ్చారు.
నర్సంపేట నియోజకవర్గ(Constituency) మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి బీఆర్ఎస్ ఆకుల తండా గ్రామ ప్రజల ఆశీర్వాదంతో బీఆర్ఎస్ పార్టీ నర్సంపేట మండల కమిటీ, ఆకుల తండా సీనియర్ నాయకులు గ్రామ ప్రజల ప్రోత్సాహంతో సర్పంచ్ అభ్యర్థిగా బరిలో నిలబడుతున్నానని కూకట్ల రవి తెలిపారు.
ఇవాళ నర్సంపేట మండలం ఆకుల తండ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా గ్రామంలో గడప గడపకు ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ అభ్యర్థి కూకట్ల రవి మాట్లాడుతూ.. గ్రామంలో పేద ప్రజలకు(people) కష్టాల్లో అండగా నిలబడతానని, ప్రజలకు ఏ సమస్య వచ్చినా తన సమస్యగా నిలబడి ప్రతి పనిలో తోడుగా ఉంటానని, ఆకులతండ గ్రామ అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తానన్నారు.
ఆకులతండ గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేస్తానని, గ్రామ పంచాయతీ ఆవరణలో మినరల్ వాటర్ ప్లాంట్(water plant), గ్రంథాలయం, మానసిక, శారీరక వికాసానికి జిమ్, గ్రామంలో సోలార్(Solar) వీధి దీపాలు, ఐకేపీ మహిళా భవనం, తండలో డ్రైనేజి నిర్మాణం, చేస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు.
ప్రతి పేదింటిలో జన్మించిన ఆడపిల్లకు కేంద్ర, రాష్ట్ర పథకాలు తల్లిదండ్రులకు అందిస్తానని హామీ ఇచ్చారు. ఆకుల తండ గ్రామస్తులు ఆశీర్వదించి తన ఉంగరం గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో సర్పంచ్ గా గెలిపించాలని గ్రామస్తులను కోరారు.

