నిజామాబాద్ ప్రతినిధి, మార్చి 29 (ఆంధ్రప్రభ) : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలకు, కేటాయింపులకు పొంతనే లేదని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ విమర్శించారు. ఇచ్చిన మాటపై నిలబడే తత్వం కాంగ్రెస్ డీఎన్ఏలోనే లేదన్నారు. శనివారం భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ… ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ చెత్తబుట్టలో వేశారని ఆరోపించారు. ‘రాజీవ్ యువ వికాస్’ పథకం పెద్ద మోసమని, గారడీ అంకెలతో మళ్లీ మోసం చేసిందన్నారు. రూ.3లక్షల60వేల కోట్ల బడ్జెట్ లో రూ.60వేల కోట్లు కమిషన్ల రూపంలో మాయమ వుతున్నాయని ఆరోపించారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు నాగోల్ల లక్ష్మీనారాయణ, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నేలంరాజు, మాజీ కార్పొరేటర్ మాస్టర్ శంకర్, మండల అధ్యక్షులు తారక్ వేణు, గడ్డంరాజు, భూపతి, నాగరాజు, మాజీ కార్పొరేటర్లు బట్టు రాఘవేందర్, కిషోర్ ఇప్పకాయల, శ్రీధర్ పంచారెడ్డి, ఇల్లందుల ప్రభాకర్ పాల్గొన్నారు.