Congress | కాంగ్రెస్ అధ్యక్షులు.. ఖరారు..!

- ఖమ్మం జిల్లాకు నూతి సత్యనారాయణ గౌడ్
- భద్రాద్రి జిల్లాకు తోట దేవి ప్రసన్న
- ఖమ్మం సిటీ అధ్యక్షుడిగా నాగండ్ల దీపక్ చౌదరి
Congress |ఖమ్మం ఉమ్మడి బ్యూరో – ఆంధ్రప్రభ : జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులను ఖరారు చేస్తూ కాంగ్రెస్ అధిష్టానం శనివారం నియామక ఉత్తర్వులు జారీ చేసింది. ఆ మేరకు ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు. ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా వైరాకు చెందిన నూతి సత్యనారాయణ గౌడ్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు తోట దేవి ప్రసన్న, ఖమ్మం సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా నాగండ్ల దీపక్ చౌదరి నియమించబడ్డారు.

నూతి సత్యనారాయణ గౌడ్ పార్టీలో సీనియర్‌గా, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ముఖ్య అనుచరుడిగా ఉన్నారు. కొత్తగూడెం జిల్లా అధ్యక్షురాలుగా నియమించబడిన తోట దేవి ప్రసన్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ముఖ్య అనుచరురాలిగా ఉన్నారు. ఖమ్మం సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియమించబడిన నాగండ్ల దీపక్ చౌదరి సీనియర్ కాంగ్రెస్ నాయకుడిగా, సిటీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ముఖ్య అనుచరుడిగా ఉన్నారు.

జిల్లాలో ఉన్న ముగ్గురు మంత్రుల అనుచరులకు మూడు పదవులు దక్కడం విశేషం. ఈ మూడు పదవుల కోసం పలువురు పోటీపడిన విషయం తెలిసిందే.

