Congress | బీఆర్ఎస్‌లో చేరికలు..

Congress | బీఆర్ఎస్‌లో చేరికలు..

Congress, వరంగల్ జిల్లా సంగెం, ఆంధ్రప్రభ : మండలంలోని కుంటపల్లి గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీ (Congress Party) నాయకులు పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ… గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సమష్టిగా పని చేస్తే విజయం మనదేనని అన్నారు. ఆరు గ్యారెంటీలు, 420 హామీల అమలు పై ఓట్ల కోసం వచ్చే స్థానిక కాంగ్రెస్ నాయకులను నిలదీయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ మోసాలను ఇంటింటి తిరిగి ప్రజలకు వివరించాలని, బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పార్టీ శ్రేణులు పని చేయాలని అన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలలే స్థానిక సంస్థ ఎన్నికల్లో బీఆర్ఎస్ (BRS) గెలుపుకు పునాదని అన్నారు. బీఆర్ఎస్ లో చేరిన వారిలో రౌతు అనిల్, రౌతు హరిశంకర్, రౌతు ఆనంద్, రౌతు శివకోటి, కడ్డూరి సుధాకర్, చిర్ర ఉప్పలయ్య, చిర్ర అనిల్, కవిరోజు రాజు, రౌతు రవీందర్, తాళ్ళపెల్లి విల్సన్, పెంతల ఎల్లయ్య, పెంతల కొమురెల్లి, జక్క సాంబయ్య, నానబోయిన సూరయ్యలతో పాటు పలువురు ఉన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు దొణికెల మల్లయ్య, పురం శ్రీనివాస్, ఎలుకుర్తి బుచ్చిరెడ్డి, పొన్నాల నర్సయ్య, యార బాలకృష్ణ, జున్న రాజు, గోవర్ధన్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply