Congress | ఆ విషయంలో.. కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళుతుంది..

Congress | ఆ విషయంలో.. కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళుతుంది..

ఆశీర్వదించిన ప్రజలకు కృతజ్ఞతలు
డిసిసి అధ్యక్షులు బట్టు కరుణాకర్

Congress, భూపాలపల్లి, ఆంధ్రప్రభ : అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్న ప్రజా ప్రభుత్వంకు ప్రజలు అండగా నిలుస్తున్నారని, భూపాలపల్లి మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను ఆశీర్వదించి, గెలిపించిన భూపాలపల్లి పట్టణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బట్టు కరుణాకర్ కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలు చూపిన విశ్వాసం, నమ్మకం కాంగ్రెస్ పార్టీ పై ఉన్న ప్రజా మద్దతుకు నిదర్శనమన్నారు. అభ్యర్థుల విజయంలో కీలక భూమిక పోషించిన ప్రతి కార్యకర్తకు, నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో ప్రజల ఆశయాలకు అనుగుణంగా సాగుతున్న ప్రజాపాలన, అదేవిధంగా ఎమ్మెల్యే సత్యనారాయణరావు పట్టణ అభివృద్ధి కోసం చేస్తున్న కృషిని ప్రజలు గుర్తించి ఓటు వేశారని హర్షం వ్యక్తం చేశారు. ప్రజల తీర్పుతో తమ బాధ్యత మరింతగా పెరిగిందని, రానున్న రోజుల్లో భూపాలపల్లి పురోగతికి, ప్రజల సంక్షేమానికి అంకితభావంతో కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తుందని తెలిపారు. అయితే.. మొదటి సారిగా గులాబీ కోట పై కాంగ్రెస్ జెండా ఎరగడంతో కార్యకర్తల్లో జోష్ పెరిగింది.

Leave a Reply