ఆశీర్వదించి గెలిపించండి

ఆశీర్వదించి గెలిపించండి
- 9వ వార్డు ప్రచారంలో దూసుకుపోతున్న కాంగ్రెస్ అభ్యర్ధి శ్రీకాంత్ గౌడ్
మోత్కూర్, ఆంధ్రప్రభ ; మోత్కూర్ మున్సిపాలిటీ ఎన్నికల్లో 9వ వార్డులో నిర్వహిస్తున్న ఇంటింటి ప్రచార పర్వంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బీసు శ్రీకాంత్ గౌడ్ ప్రచార పర్వంలో ముందంజలో ఉన్నారు . తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ గురువారం రాత్రి కొండాపురంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో బీసు శ్రీకాంత్ గౌడ్ ను గెలిపించాలని జామచెట్ల బావి, కొండాపురం ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. గత 10 సంవత్సరాల పాలనలో బిఆర్ఎస్ ప్రభుత్వం కనీసం బీటీ రోడ్డు కూడా వేయలేదని …తన హయాంలో రూ. 5 కోట్లతో బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేయగా …ప్రస్తుతం బి టి రోడ్డు పనులు జరుగుతున్నాయని , ఈ గ్రామానికి రోడ్డు పూర్తయిన వెంటనే ఆర్టీసీ బస్సు సౌకర్యం సైతం కల్పిస్తామని గ్రామస్తులకు హామీ ఇచ్చారు.
కొండాపురంలో కమ్యూనిటీ హాల్ మంజూరు చేయాలని ప్రజలు విన్నవించగా …ఎమ్మెల్యే సామెల్ కమిటీ హాల్ నిర్మాణానికి ఎన్నికల అనంతరం నిధులు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. కొండాపురం, జామ చెట్ల బావి, మంగళిగడ్డ , గడి బజార్ లలో కాలికి మట్టి అంటకుండా… పూర్తిస్థాయిలో సీసీ రోడ్లతోపాటు, ఎన్నో ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన పాత డ్రైనేజీలకు సైతం మోక్షం కల్పించి నూతన డ్రైనేజీల నిర్మాణం చేపడతామన్నారు. శుక్రవారం స్థానిక గడి బజార్ లో జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు ఫైళ్ల సోమిరెడ్డి నేతృత్వంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుండగొని రామచంద్రు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో కలిసి ఇంటింటికీ ప్రచారం నిర్వహించారు.
ఈ నెల 11 న జరిగే మున్సిపల్ ఎన్నికల్లో కొండాపురం, పాత గ్రామపంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల లోపు ఓటర్లు తమ ఓటును చెయ్యి గుర్తు కు ఓటేసి అత్యధిక మెజార్టీ తో గెలిపించాలని కోరుతూ ఓటర్లను ఆత్మీయంగా కలుస్తూ విన్నవిస్తున్నారు.ఈ సందర్భంగా ఆయన వెంట జిల్లా కాంగ్రెస్ నాయకులు పర్రెపాటి యుగంధర్,అనాజీపురం సర్పంచ్ బీసు వెంకటయ్య,స్థానిక నాయకులు బీసు సాయి కుమార్,పిట్టల బాలయ్య,చిర్రబోయిన కొమురయ్య,పట్టురి అంజయ్య,బోయిన ఉప్పలయ్య,మహేందర్,కప్పే యాకేశ్,లెనిన్,రవి,బీసు నర్సింహ,చంద్రమౌళి, బీసు నరేశ్,గుండు నర్సింహా తదితరులు పాల్గొన్నారు.
