congress l ప్రజా సమస్యల పరిష్కార మే కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యం..

congress l ప్రజా సమస్యల పరిష్కార మే కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యం..

పదో వార్డులో ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జేజే సంటి లత నర్సయ్య,

congress l భీమ్‌గల్‌ రూరల్, ఆంధ్రప్రభ: భీమ్‌గల్‌ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పదో వార్డులో జేజే సంటి లత,జేజే నర్సయ్య ఆధ్వర్యంలో విస్తృతంగా ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటికి కొనసాగుతోంది. వార్డు పరిధిలోని ప్రధాన వీధులు,కాలనీలు, బస్తీల్లో ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలుసుకుంటూ తమకు మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు.ఈ సందర్భంగా వార్డు అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారమే తమ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.వార్డు ప్రజలు ఎదుర్కొంటున్న తాగునీటి కొరత, డ్రైనేజ్ సమస్యలు, దెబ్బతిన్న రహదారులు, వీధి దీపాల లోపం,పారిశుధ్య సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు.

ఎన్నికల్లో గెలిస్తే పారదర్శకంగా పనిచేస్తూ ప్రతి సమస్యను దశలవారీగా పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండే ప్రజా ప్రతినిధులుగా సేవ చేయడం తమ బాధ్యతగా భావిస్తున్నామని పేర్కొన్నారు.ప్రచారంలో భాగంగా మహిళలు, యువత, వృద్ధులతో ప్రత్యేకంగా సమావేశమై వారి అభిప్రాయాలు తెలుసుకుంటూ అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు.పదో వార్డును అన్ని విధాలుగా అభివృద్ధి చేసి ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దుతామని తెలిపారు.ప్రజల నుంచి లభిస్తున్న మంచి స్పందన తమకు మరింత ఉత్సాహాన్ని ఇస్తోందని, భారీ మెజారిటీతో గెలుస్తామనే నమ్మకం వ్యక్తం చేశారు.ఈ ప్రచార కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ స్థానిక నాయకులు, పార్టీ కార్యకర్తలు, మహిళలు, యువకులు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై జేజే లత, నర్సయ్య కు మద్దతు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply