congress lఅభివృద్ధికి కేరాఫ్ అడ్రస్.. మేడారపు అపర్ణ ప్రదీప్ ను గెలిపించండి..

congress l అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్.. మేడారపు అపర్ణ ప్రదీప్ ను గెలిపించండి..

congress l నిర్మల్ టౌన్, ఆంధ్రప్రభ; ఈనెల 11న జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో 24 వ మీ వార్డు అభివృద్ధి చెందాలంటే మేడారపు అపర్ణ ప్రదీప్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంబడి రాజేశ్వర్ ప్రజలకు పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గాంధీ చౌక్ ప్రాంతంలో పర్యటించి ఓటరులను కాంగ్రెస్ పార్టీకి ఓటు ఇవ్వాలని అభ్యర్థించారు. గత మూడు పర్యాయలుగా మీ వార్డును అభివృద్ధి చేసిన ఘనత మేడారపు అపర్ణ ప్రదీప్ కే దక్కుతుందన్నారు. 24 గంటలు కాలనీవాసులకు అందుబాటులో ఉండే నాయకుడు కావాలో చుట్టం చూపుకు వచ్చే నాయకుడు కావాలో ఎల్లవేళలా మీ వెంటే ఉండే నాయకుడు కావాలో ఓటర్లే తేల్చుకోవాలని గుర్తు చేశారు.. అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్ గా నిర్మల్ పట్టణంలో నిలిచిన మేడారం అపర్ణ ప్రదీప్ సేవలు మరువలేనివని మరో మారు గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు. నిర్మల్ మాజీ ఎంపీపీ సద సుదర్శన్ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు ఆమడ శ్రీధర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు

Leave a Reply