Congress l సొంత నిధులతో పేదలకు సహాయం చేస్తాను….

Congress l సొంత నిధులతో పేదలకు సహాయం చేస్తాను….
ఇంటింటి ప్రచారం చేస్తున్న ఎన్నికల ఇన్చార్జి రాజు గౌడ్
మధుసూదన్ గెలుపుతోనే వార్డు సమస్యలు పరిష్కారం
ఎమ్మెల్యే సహకారంతో వార్డు అభివృద్ధి
నియోజకవర్గం ఎన్నికల ఇన్చార్జి రాజు గౌడ్
Congress l చౌటుప్పల్,ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీలోని 19వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి పిల్లలమర్రి మధుసూదన్ గెలుపుతోనే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని మునుగోడు నియోజకవర్గం ఎన్నికల ఇన్చార్జి పబ్బు రాజు గౌడ్ తెలిపారు. ఆదివారం సాయంత్రం వార్డు కౌన్సిలర్ అభ్యర్థి పిల్లలమర్రి శ్రీనివాస్ తో కలిసి ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించారు. వార్డు కౌన్సిలర్ గా కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న మధుసూదన్ డబ్బుల కోసం రాజకీయాలలోకి రాలేదని, ప్రజలకు సేవ చేయాలని లక్ష్యంతో వచ్చారని, వార్డు ప్రజలు వాస్తవాలను కౌన్సిలర్ గా మధుసూదన్ లు గెలిపించాలన్నారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో ఇప్పటివరకు మున్సిపాలిటీలో అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం జరిగిందని, మధుసూదన్ ను కౌన్సిలర్ గా గెలిపిస్తే ఎమ్మెల్యే సహకారంతో వార్డులోని సమస్యలన్నింటిని పరిష్కరించడం జరుగుతుందన్నారు.
వాడు కౌసర్ అభ్యర్థి పిల్లలమర్రి మధుసూదన్ నాయకులతో కలిసి వార్డులోని ప్రతి ఇంటికి తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరిస్తూ తనను కౌన్సిలర్ గా గెలిపిస్తే ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో వార్డులోని ప్రజలు ఎదుర్కొంటున్న అన్ని సమస్యలను పరిష్కరిస్తానని మధుసూదన్ హామీ ఇస్తున్నారు. వార్డులో ఇప్పటివరకు ఉన్న కౌన్సిలర్ ఎటువంటి అభివృద్ధి పనులు చేయలేదన్నారు. అధికారంలో ఉన్న పార్టీ అభ్యర్థిని కౌన్సిలర్ గా గెలిపిస్తేనే అభివృద్ధి జరుగుతుందని ప్రజలు గుర్తించాలని మధుసూదన్ కోరారు. తనను కౌన్సిలర్ గా గెలిపిస్తే మీకు అందుబాటులో ఉండి సేవ చేస్తానని, తన సొంత నిధులతో ప్రతి పేద ఆడబిడ్డ వివాహానికి రూ. 10 వేలు, ప్రతి పేద మహిళ డెలివరీ కోసం రూ. 10వేలు, ప్రతి పేద కుటుంబానికి ఆస్పత్రి వైద్య సహాయం కోసం రూ. 10వేలు ఆర్థిక సహాయం చేస్తానని, పీర్ల కొట్టం వద్ద వాటర్ ఫిల్టర్ ను ఏర్పాటు చేయిస్తానని, విద్యుత్తు తదితర సమస్యలన్నింటినీ పరిష్కరిస్తానని మధుసూదన్ వార్డు ప్రజలకు హామీ ఇస్తూ 19వ వార్డులో మీకు సేవ చేసే అవకాశం కల్పించాలని కోరారు. ఈ ప్రచారంలో కాంగ్రెస్ నాయకులు బోయ దేవేందర్, ఖయ్యూం, మొగుదాల రమేష్ గౌడ్, వీరమల్ల వెంకటేశం గౌడ్, బొంగు జంగయ్య గౌడ్, కంచరకుంట్ల రామ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

