Congress | ఇందిరమ్మ ఇండ్లతో పేదవారి కల సాకారం

Congress | ఇందిరమ్మ ఇండ్లతో పేదవారి కల సాకారం
Congress | సిర్పూర్ (యు), ఆంధ్రప్రభ : రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ పథకం ద్వారా ఇల్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయడంతో పేదవారి ఇండ్ల కల సాకారం అవుతుందని కొమరం భీం అసిఫాబాద్ జిల్లా సిర్పూర్ (యు) మండలంలోని బాబ్జిపేట్ నూతన సర్పంచ్ పెందూర్ మాధవ్ రావు, సిర్పూర్ (యు) ఎంపీడీవో కృష్ణారావు అన్నారు.

వారు ఇవాళ బాబ్జిపేట గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి మార్కౌట్ ఇచ్చారు. అనంతరం లబ్ధిదారులతో సమావేశం ఏర్పాటు చేసి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం బిల్లుల విషయంలో అవగాహన కల్పించారు. లబ్ధిదారులు త్వరగా ఇళ్ల నిర్మాణ పనులు పూర్తి చేస్తే దశలవారీగా బిల్లులు వస్తాయని వారు పేర్కొన్నారు. ఈ సమావేశంలో హౌసింగ్ ఏఈ ప్రవీణ్ కుమార్, పంచాయతీ కార్యదర్శి గోపాల్, లబ్ధిదారులు, ప్రజలు పాల్గొన్నారు.
