Conference | సంక్షేమం సార్థకం కోసం..
Conference | శ్రీ సత్య సాయి బ్యూరో, ఆంధ్రప్రభ : ప్రభుత్వ శాఖలన్నీ సమర్థవంతంగా పని చేయడం వల్ల సంక్షేమం సార్థకం అవుతుందని జిల్లా కలెక్టర్ ఏ శ్యాం ప్రసాద్ తెలిపారు. ఈ రోజు స్థానిక కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్(Conference) హాలులో వ్యవసాయం, ప్రకృతి వ్యవసాయం, పట్టు పరిశ్రమ, డిఆర్డీఓ, జిల్లా లీడ్ బ్యాంక్ అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం(review meeting) నిర్వహించారు.
ఆయా శాఖలలో అమలవుతున్న పథకాలు, లక్ష్యాలు, వాటి అమలు ఇప్పటి వరకు సాధించిన ప్రగతి.. ఇంకనూ సాధించవలసిన ప్రగతికి తీసుకున్న చర్యలు, చేపట్టాల్సిన కార్యాచరణ తదితరాల విషయాల పై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయా శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

