హార్ట్ ఎటాక్ వల్లే..

ఆంధ్రప్రభ వెబ్ డెస్క్: మియాపూర్(Miyapur) డిపోలో కండక్టర్‌(Conductor)గా పనిచేస్తున్న పండరి(Pandari) మంగళవారం ఉదయం డ్యూటీకి వచ్చాడు. తోటి ఉద్యోగులతో మాట్లాడుతూ, “వాష్‌రూమ్‌కు వెళ్లి వస్తా” అని చెప్పి అక్కడికి వెళ్లాడు. కానీ, అక్కడే అతడు కుప్పకూలి మృతి చెందాడు. వైద్యుల పరీక్షల్లో హార్ట్ ఎటాక్(Heart attack) వల్లే మరణించినట్లు నిర్ధారణ అయింది.


ఆర్టీసీ డిపోలో విషాదం నెలకొంది. యువకుడైన పండరి ఇలా ఆకస్మికంగా విగతజీవి అవడంతో తోటి సహోద్యోగులు షాక్‌లో మునిగారు. అతడు కళ్లముందే మృత్యువాత పడిపోవడం చూసి సీనియర్లు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటన డిపో వాతావరణాన్ని మరింత గంభీరంగా మార్చింది.

Leave a Reply