Conduct | ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించాలి :

Conduct | ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించాలి :
Conduct | నర్సంపేట, ఆంధ్రప్రభ : నర్సంపేట డివిజన్లోని నాలుగు మండలాల్లో మూడో విడత స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారద సూచించారు. ఎన్నికల నిర్వహణ(Conduct elections)కు వెళ్లే పోలింగ్ సిబ్బంది ప్రయాణ పరిస్థితులను కలెక్టర్ సతీష్ శారద నర్సంపేట, నెక్కొండ, చెన్నారావుపేట, కానాపురం మండలాల్లో పరిశీలించారు.
డివిజన్లోని నర్సంపేట మండలంలో 29 గ్రామపంచాయతీలు సర్పంచ్, 164 వార్డు సభ్యుల(164 ward members)ను ఎన్నుకోవడానికి 22.472 మంది ఓటర్లు ఎన్నుకొనున్నారు. నెక్కొండ మండలంలో 6 గ్రామపంచాయతీల సర్పంచులు ఏకగ్రీవం కాగా, 33 మంది సర్పంచులను 280 వార్డు సభ్యులను 40.210 మంది ఎన్నుకున్నారు.
ఖానాపురం మండలంలో ఒక సర్పంచ్ ఏకగ్రీవం కాగా 20 మంది సభ్యులను 164 వార్డ్ మెంబర్లకు ఎన్నికలు జరగనున్నాయి. చెన్నారావుపేట మండలంలో 29 సర్పంచులను 23 వార్డు సభ్యులను 21.871 మంది ఓటర్లు వారి ఓటు హక్కును(voting rights) వినియోగించుకోనున్నారు చెన్నారావుపేట మండలంలోని 35 వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారులు ప్రకటించారు.

బుధవారం ఉదయం ఏడు గంటల నుండి ఒంటిగంట వరకు నిర్వహించే ఎన్నికలకు ఎన్నికల సిబ్బంది వారి సామాగ్రితో బస్సులలో ఆయా గ్రామ పంచాయతీలకు తరలి వెళ్లారు. దీంతో ఎంపీడీవో కార్యాలయం(MPDO office)లో హడావుడి ఉన్న అధికారులు అబ్జర్వర్లు అందరూ వారికి కేటాయించిన స్థానాలకు బస్సులలో పోలీస్ ఎస్కార్ట్ సహాయంతో తరలి వెళ్లారు. ఉదయం ఏడు గంటల నుండి ఒంటిగంట వరకు ఎన్నికలు జరగనున్నాయి.
