Condolence | ప్రేక్ష‌కుల హృద‌యాలలో కోట స్థానం శాశ్వ‌తం ..కెసిఆర్

హైద‌రాబాద్ – ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు (kota srinivasarao ) మరణం పట్ల మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (KCR ) సంతాపం (Condolence ) ప్రకటించారు. ఈ మేరకు సంతాప ప్రకటన విడుదల చేశారు కేసీఆర్. విభిన్న పాత్రలను పోషించి, ప్రేక్షక హృదయాల్లో తన స్థానాన్ని పదిలపరుచుకున్న విలక్షణ వెండితెర నటుడు కోట అని ఉద్ఘాటించారు. కోట మరణంతో సినిమా రంగం గొప్ప నటుడిని కోల్పోయిందని విచారం వ్యక్తం చేశారు. ఆయన స్థానాన్ని ఎవ‌రూ భ‌ర్తీ చేయ‌లేర‌న్నారుఉ ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. శోకతప్తులైన వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

అసాధార‌ణ న‌టుడు కోట – కెటిఆర్

సీనియర్‌ నటులు కోట శ్రీనివాసరావు మరణం పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర సంతాపం తెలిపారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో విలక్షణ నటుడిగా, అసాధారణ పాత్రధారిగా తనదైన ముద్ర వేసిన కోట శ్రీనివాసరావు మరణం ఆవేదన కలిగించిందన్నారు. విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, హాస్య నటుడిగా ఆయన పోషించిన విభిన్న పాత్రలు తెలుగు సినిమా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయని చెప్పారు.

ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయిన కోట: హరీశ్‌ రావు

కోట శ్రీనివాసరావు మృతి పట్ల బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్ రావు సంతాపాన్ని వ్యక్తం చేశారు. నాలుగు దశాబ్దాల సినీ ప్రయాణంలో, 750కు పైగా చిత్రాల్లో విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకులను మెప్పించిన ఆయన ఒక విలక్షణ నటుడని కొనియాడారు.

Leave a Reply