Market| కూరగాయల వ్యాపారుల ఆందోళన

Market| చెన్నూర్, ఆంధ్రప్రభ : చెన్నూరు పట్టణ, మార్కెట్ తదితర ప్రాంతాల్లో కూరగాయల వ్యాపారాలు ఇవాళ స్థానిక మున్సిపల్ కార్యాలయంలో బైఠాయించి మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ చేపడుతున్న నిర్ణయాలను ఎండగడుతూ ఆందోళన చేశారు. ఈ సందర్బంగా పలువురు వ్యాపారులు మాట్లాడుతూ… తామంతా కొన్నేళ్ల నుంచి పట్టణంలోని కొత్త బస్టాండ్, మార్కెట్, గాంధీ చౌక్, ప్రజలకు అందుబాటులో ఉండే ప్రాంతాల్లో చిరు (కూరగాయల )వ్యాపారాలు చేసుకొని జీవనం సాగిస్తుంటే స్థానిక మున్సిపల్ కమిషనర్ పూర్తి సౌకర్యాలు లేని ఇంటిగ్రేటెడ్ మార్కెట్ లో వ్యాపారాలు చేసుకోవాలని హుకుం జారీ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
సౌకర్యాలు లేని మార్కెట్లోకి వెళ్ళి తాము వ్యాపారాలు చేయలేమని తేల్చిచెప్పినా తమపై ఒత్తిడి తీసుకువచ్చి తమ వ్యాపారాలు సాగకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఇంటిగ్రేటెడ్ మార్కెట్లో తమకు అన్ని సౌకర్యాలు కల్పించిన తరువాతే తాము వ్యాపారాలు సాగిస్తామని హెచ్చరించారు.

