Complaint | రెడీమిక్స్ క్రషర్ ను తొలగించాలి

Complaint | రెడీమిక్స్ క్రషర్ ను తొలగించాలి

Complaint | నల్లబెల్లి, ఆంధ్రప్రభ : కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం సమీపంలో పనిచేస్తున్న రెడీమిక్స్ క్రషర్ తీవ్ర కాలుష్యానికి కారణమవుతుందని నల్లబెల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బత్తిని మహేష్, వరంగల్ జిల్లా కలెక్టర్ (Collector) సత్య శారదకు ఫిర్యాదు చేశారు. మహేష్ మాట్లాడుతూ… స్కూల్లో చదువుకుంటున్న విద్యార్థినీలు ధూళి, శబ్ధ కాలుష్యం వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, కొందరు విద్యార్థులు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని తెలిపారు. అలాగే, సమీపంలోని రామాలయం, పెద్దమ్మ తల్లి ఆలయాలకు వచ్చే భక్తులు కూడా దుమ్ము, శబ్ధం కారణంగా అసౌకర్యం అనుభవిస్తున్నారని పేర్కొన్నారు.

క్రషర్‌ వల్ల సమీప వ్యవసాయ భూములు కూడా నష్టపోతున్నాయని ఆయన తెలిపారు. పర్మిషన్ లేకుండా ఎస్‌ఆర్‌ఎస్‌పీ కెనాల్ దారి నుంచి భారీ వాహనాలు ప్రయాణించడంతో కెనాల్ బ్రిడ్జి, సీసీ రోడ్లు దెబ్బతింటున్నాయని గుర్తించారు. స్కూలు పిల్లలు, టీచర్లు, పేరెంట్లు అదే దారిలో (Road) ప్రయాణించడం వల్ల ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని మహేష్ ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామస్థులు పిల్లల భద్రత, గ్రామీణుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని రెడీమిక్స్ క్రషర్‌ను తక్షణం తొలగించాలంటూ డిమాండ్ చేశారు.

Leave a Reply