Commissioner | మంథని, ఆంధ్రప్రభ : గ్రామ పంచాయతీ ఎన్నికల మొదటి విడత పోలింగ్ కమిషనరేట్(Polling Commissionerate) పరిధిలోని అన్ని గ్రామాల్లో ప్రశాంతంగా జరుగుతోందని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా తెలియజేశారు. గురువారం మొదటి విడత పోలింగ్ సరళిని పరిశీలించారు. మంథని మండలం(Manthani Mandala) గుంజపడుగు ప్రాంతంలోని పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఓటు హక్కును వినియోగించుకోవడానికి వచ్చిన వృద్ధురాలితో ఆప్యాయంగా మాట్లాడి ఆమె ఓటర్ గుర్తింపు వివరాలు, వార్డ్ సమాచారం తెలుసుకున్నారు. ఓటు ఎక్కడ వేయాలో.. పోలింగ్ బూత్ లో ఎలా వినియోగించుకోవాలో తెలియచేశారు. ఏవైనా ఇబ్బందులు ఎదురైతే.. వెంటనే అక్కడున్న పోలీసు సిబ్బంది సహాయం చేస్తారని చెప్పారు. వృద్ధులు, దివ్యాంగుల కోసం ప్రత్యేక సదుపాయాలు(Special facilities) అందుబాటులో ఉంచినట్లు, ప్రతి ఓటరు స్వేచ్ఛగా, భయభ్రాంతులు లేకుండా ఓటు వేయడానికి సమగ్రంగా బందోబస్తు ఏర్పాటు చేసినట్లు కమిషనర్ తెలిపారు.
Commissioner | పోలింగ్ ప్రశాంతం..

