హైదరాబాద్ : చార్మినార్ పరిధిలోని గుల్జార్ హౌస్‌లో ఆదివారం ఉదయం జరిగిన భారీ అగ్ని ప్రమాదంపై స్థానిక ఎంపీ అససుద్దీన్ ఓవైసీ దిగ్ర్బాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదానికి ముమ్మాటికీ విద్యుత్తు శాఖ నిర్లక్ష్యమే కారణమన్నారు.
ఈ భవనంలో అనేక రోజులుగా విద్యుత్తు లైన్ లో మంటలు వస్తున్నాయని, ఈ సమాచారాన్ని స్థానికులు ఎన్ని సార్లు మొత్తుకున్నా విద్యుత్తు శాఖ అధికారులు స్పందించలేదన్నారు. షార్ట్ సర్క్యూట్ ప్రమాదాలపై అవగాహన లేకపోవటంతో ప్రజలు కూడా మిన్నకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎంపీ ఓవైసీ డిమాండ్ చేశారు.