Commando Deepak | ముగ్గురు మావోయిస్టుల మృతి

Commando Deepak | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో భద్రతా దళాలు, మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మరణించారు. ఈ ఘటనలో ఒక పోలీసు అధికారి ప్రాణాలు కోల్పోగా, మరొకరు గాయపడ్డారు. ఈ సంఘటన జిల్లాలో భద్రతా పరిస్థితులపై ఆందోళన రేకెత్తించింది.
ఫొదేవా ఫారెస్ట్‌లో మావోయిస్టుల కదలికలు ఉన్నాయన్న పక్కా సమాచారంతో పోలీసులు సీ-60 కమాండోలు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో వారికి మావోయిస్టులు ఎదురుపడటంతో ఇరువర్గాల మధ్య కాల్పులు మొదలయ్యాయి. ఈ భీకర ఎన్కౌంటర్లో ముగ్గురు మావోయిస్టు మృతిచెందారు. అనంతరం స్పాట్లో భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. అలాగే మావోయిస్టుల కాల్పుల్లో కమెండో దీపక్ మృతిచెందారు. మరో జవాన్ కు గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు.
