కుంభమేళాకు రండి..

కుంభమేళాకు రండి..

ఎన్టీఆర్ బ్యూరో, ఆంధ్రప్రభ : ఇంద్రకీలాద్రి పై కొలువైన శ్రీ కనకదుర్గమ్మ దేవస్థానంలో అత్యంత వైభవంగా నిర్వహించనున్న మహాకుంభాభిషేక మహోత్సవానికి తప్పకుండా రావాలంటూ కంచి పీఠాధిపతులను దుర్గగుడి దేవస్థానం ఈవో శీనా నాయక్ చైర్మన్ బొర్రా గాంధీలు ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఆహ్వానం అందించేందుకు దేవస్థాన ప్రతినిధులు కంచి క్షేత్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా కంచి కామకోటి పీఠాధిపతులు శంకర విజయేంద్ర సరస్వతిను దర్శించి ఆహ్వాన పత్రికను సమర్పించారు. ఆహ్వానం అనంతరం కంచిలో నిర్వహించిన పల్లకీ ఉత్సవంలో దేవస్థాన ప్రతినిధులు స్వయంగా పాల్గొని పల్లకీ సేవలో భాగమయ్యారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అమ్మవారి మహాకుంభాభిషేకానికి ఆహ్వానం అందించే వేళ కంచి పీఠాధిపతుల పల్లకీ సేవలో పాల్గొనే భాగ్యం లభించడం విశేషమని తెలిపారు. ఈ ఘటనను మహోత్సవానికి శుభసూచకంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. కంచి పీఠాధిపతులు కూడా ఆహ్వానం పై సానుకూలంగా స్పందించి, విజయవాడలోని కనకదుర్గమ్మ ఆలయ ప్రాశస్త్యాన్ని కొనియాడారు. త్వరలో జరగనున్న మహాకుంభాభిషేకం ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

Leave a Reply