KNL | శ్రీశైలం బ్రహ్మోత్సవాలకు రండి.. చంద్రబాబుకు ఆహ్వానం

ఆంధ్రప్రభ నంద్యాల బ్యూరో, ఫిబ్రవరి 17 : నంద్యాల జిల్లా పరిధిలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలైన శ్రీశైలం, మహానందిలో జరిగే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకి సోమవారం ప్రత్యేక ఆహ్వానం అందజేశారు. శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి, మహానంది శ్రీశైలం దేవస్థానం ఎగ్జిక్యూటివ్ అధికారులు వెలగపూడిలోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయానికి వెళ్లి ప్రత్యేక ఆహ్వాన పత్రికను అందజేశారు.

మహానంది, శ్రీశైలం ఆహ్వాన పత్రికలతో పాటు శ్రీ అమ్మవారి ప్రసాదాలను కూడా అందజేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈనెల 23వ తేదీన శ్రీశైలంలోని భ్రమరాంబిక మల్లికార్జున స్వాముల ఆశీర్వాదం చేసుకునేందుకు వస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో వేద పండితులు దేవస్థానం అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply