College | వార్షిక సాంస్కృతిక వేడుక శ్రీథమ్ -2026

College | వార్షిక సాంస్కృతిక వేడుక శ్రీథమ్ -2026

  • అద్బుతమైన గాన ప్రదర్శన
  • సుమతి రెడ్డిలో కోలాహలంగా శ్రీధమ్- 2026 (ప్రో నైట్)
  • ప్రతిభ,సృజనాత్మకను వేదికగా నిలిచిన వేడుకలు
  • శ్రీతనిధి పుస్తకాన్ని ఆవిష్కరించిన విద్యా సంస్థల
  • సంప్రదాయ దుస్తులతో నృత్యాలు చేసి అలరించిన విద్యార్థినులు
  • చైర్మన్ వరదారెడ్డి

College | హసన్ పర్తి , ఆంధ్రఫ్రభ : అనంతసాగర్ లోని సుమతి రెడ్డి మహిళ ఇంజనీరింగ్ కళాశాలలో వార్షిక సాంస్కృతిక వేడుక శ్రీథమ్ -2026 లోభాగంగా రెండవ రోజు ప్రోనైట్ కార్యక్రమాన్ని అత్యంతవైభవంగా, కోలాహలంగా,ఉత్సాహ భరితంగా కొనసాగాయి. ఈకార్యక్రమం విద్యార్థినులో నిగూడంగా దాగివున్న నైపుణ్యాలు,ప్రతిభ, సృజనాత్మక ఉల్లాసాన్ని ప్రదర్శించే వేదికగా వేడుకల నిలిచాయి. ఉత్సవాలలో సాంస్కృతిక వైభవాన్ని ప్రతిబింబించే విధంగా అలరించాయి. ఈ కార్యక్రమాన్ని ఎస్సార్ విద్యా సంస్థల చైర్మన్ ఏ వరద రెడ్డి , కళాశాల పిన్సిపాల్ ఐ రాజాశ్రీ రెడ్డి ఘనంగా జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కళాశాల ఈ సంవత్సర కాలంలో సాధించిన విద్యా సాంస్కృతిక, పరిపాలన అభివృద్ధిని ప్రతిబింబించే “శ్రీథనిధి” అని ప్రత్యేక పుస్తకాన్ని ఆవిష్కరించారు.

ఈ పుస్తకం సంస్థ పురోగతిని సమగ్రంగా ప్రతిబింబించేలా రూపొందించారు. ప్రోనైట్ లో భాగంగా విద్యార్థినిలు వివిధ అంశాలపై నృత్య ప్రదర్శనలో బాగంగా సంప్రదాయం, ఆధునిక నృత్యాలు,ఫ్యూబిన్ డాన్సులు, వివిధ థీమ్ ఆధారిత నృత్య ప్రదర్శనలు ప్రేక్షకులలో విశేషంగా జోష్ నింపింది. ప్రదర్శనలో విద్యార్థుల ప్రతిభ, క్రమశిక్షణ,కళా నైపుణ్యం స్పష్టంగా వెలుగులోకి వచ్చింది. రంగురంగుల వేషధారణ సంగీతానికి అనుగుణమైన నృత్యాలు కార్యక్రమానికి ప్రత్యేక శోభను తీసుకొచ్చాయి. ఈ ప్రోనైట్ కు ప్రధాన ఆకర్షణగా ప్రముఖ గాయకుడు కాశ్యప్ తన బ్యాండు ఆరోహితో కలిసి అద్భుతమైన గాన ప్రదర్శనను అందించారు. వారి లైవ్ సింగింగ్ మరియు బ్యాండ్ ప్రదర్శన విద్యార్థిలను ఉత్సాహంతో ఉర్రూతలూగించింది. ప్రసిద్ధ సినీ గీతాలు మధురమైన మెలోడీలు మరియు వేగవంతమైన పాటలతో కార్యక్రమం ఉత్సవ వాతావరణం సంతరించుకుంది. విద్యార్థులను పాటలతో పాటు తాళం వేస్తూ, నర్తిస్తూ తమ ఆనందాన్ని వ్యక్తంచేశారు.

ఇందులో భాగంగా నిర్వహించిన ర్యాంపు వాక్ కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది ఈ సందర్భంగా వరద రెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థుల ప్రతిభ, నైపుణ్యాలను అభినందిస్తూ ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు భవిషత్తులో విద్యార్థులు సమగ్ర అభివృద్ధికి ఎంతో దోహదపడతాయని తెలిపారు. డాక్టర్ ఐ రాజశ్రీ రెడ్డి మాట్లాడుతూ విద్యతో పాటు సాంస్కృతిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనడం ద్వారా విద్యార్థులలో అన్ని నైపుణ్యాలు సాధించి భవిష్యత్తులో విజయవంతమైన ఉన్నత శిఖరాలకు చేరుకోగలుగుతారని వివరించారు. పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కోఆర్డినేటర్లు జి. ఝాన్సీరాణి, జె. వేదిక వివిధ విభాగాలుపతులు,ఈ. సుదర్శన్, డా. కుమార స్వామి,ఎన్. శ్రీవాణి,కే. శ్రీనివాస్,బి. ప్రశాంత్, ఏవో వేణుగోపాలస్వామి తోపాటు కళాశాల సిబ్బంది, విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Leave a Reply