మొంథాపై అధికారుల‌కు కలెక్టర్ వినోద్ కుమార్ సూచ‌న‌లు

మొంథాపై అధికారుల‌కు కలెక్టర్ వినోద్ కుమార్ సూచ‌న‌లు

బాపట్ల కలెక్టరేట్ అక్టోబర్ 26 ఆంధ్రప్రభ : మొంథా తుఫాను దృష్ట్య అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని, ముప్పు నుంచి త‌ప్పించుకునేందుకు ఏలాంటి ర‌క్ష‌ణ చ‌ర్య‌లు తీసుకోవాలో తెలుపుతూ బాప‌ట్ల క‌లెక్ట‌ర్ వినోద్‌కుమార్ జిల్లా అధికారుల‌కు దిశానిర్దేశం చేశారు. ఆదివారం కలెక్టరేట్లోని న్యూ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు ఏర్పాటుచేసిన కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి జిల్లా అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలను, తహసీల్దారులను, వివిధ శాఖల జిల్లా, మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు.

ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, మంచి నీరు ఆహారం అన్ని సౌకర్యాలు బాధితులకు కల్పించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. అధికారుల సమ‌ష్టి కృషితో రెడ్ అలర్ట్ సూచిస్తున్న మొంథా తుఫాను తీరం దాటిన 24 గంటల్లోపే గ్రీన్ కలర్ పరిస్థితులను తీసుకురావాలని కలెక్టర్ ఆదేశించారు. నిత్యావసర వస్తువులు, ఔషధాలు, కూరగాయలు, మంచినీళ్లు అన్ని ముందుగానే ప్రజలు సమకూర్చుకొని అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Leave a Reply