కళాకారుడు చలపతికి..

  • కలెక్టర్ శ్యాంప్రసాద్ ప్రశంసలు

(శ్రీ సత్య సాయి బ్యూరో, ఆంధ్రప్రభ): ప్రాచీన సాంప్రదాయాలు, హస్త కళలకు భారతదేశం పుట్టినిల్లని ప్రతి ఒక్కరూ బాధ్యతగా సంరక్షించుకోవాలని జిల్లా కలెక్టర్ ఏ. శాంప్రసాద్ (Collector A. Samprasad) అన్నారు. శనివారం ధర్మవరం మండలం నిమ్మలకుంట గ్రామంలో ప్రసిద్ధ తోలుబొమ్మలాట కళాకారుడు పద్మశ్రీ దలవాయి చలపతి రావు (Chalapathi Rao) ఇంటిని సందర్శించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ తోలు బొమ్మలాట కళాకారుడు దలవాయి చలపతిరావుతో మాట్లాడుతూ.. ఈ కళ నీకు ఎలా వచ్చిందని, ఎప్పటినుండి ఈ కళను చేస్తున్నారని ఇంకా తొలుబొమ్మలును ఎలా తయారు చేసే వారని, ఎటువంటి రంగులు వాడేవారని అడిగి పలు వివరాలు తెలుసుకున్నారు. పూర్వం ఈ తోలుబొమ్మలాట (Tholu Bommalata) బొమ్మల వల్ల పురాణాలను చెప్పేవారమని కళాకారుడు దలవాయి చలపతిరావు కలెక్టర్ కు విన్నవించారు. పద్మశ్రీ అవార్డు గ్రహీత (Padma Shri Awardee) తోలుబొమ్మలాట కళాకారుడుతో తోలుబొమ్మలాటకు ప్రత్యేకత తీసుకురావడంలో దలవాయి చలపతి పాత్ర మరువలేనిదన్నారు. ఈ కార్యక్రమంలో ధర్మవరం ఆర్డీవో మహేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply