ప్ర‌శంసా ప‌త్రాలు అంద‌జేసిన క‌లెక్ట‌ర్‌..

ప్ర‌శంసా ప‌త్రాలు అంద‌జేసిన క‌లెక్ట‌ర్‌..

విజయవాడ, ఆంధ్రప్రభ : దసరా మహోత్సవాలలో రెడ్ క్రాస్ సంస్థ(Red Cross organization) అందించిన సేవలు ప్రశంసనీయమైనవని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ & ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఎన్టీఆర్ జిల్లా ప్రెసిడెంట్ డాక్టర్ జి. లక్ష్మీశ(Dr. G. Lakshmisha) అన్నారు. స్థానిక కలెక్టరేట్లోని శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో జరిగిన రెడ్ క్రాస్ వాలంటీర్ల అభినందన సభకు కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ జి. లక్ష్మీశ మాట్లాడుతూ.. దసరా మహోత్సవాలలో వృద్ధులకు, దివ్యాంగులకు రెడ్ క్రాస్ వాలంటీర్లు మంచి సేవలు అందించారని చెప్పారు.

ఉత్సవాలు 11 రోజులపాటు జరిగినా, లక్షలాది భక్తులు హాజరైనా రెడ్ క్రాస్ వాలంటీర్లు అలుపెరగకుండా రాత్రింబవళ్లు పనిచేశారని చెప్పారు. ఉత్సవాలు విజయవంతంగా(successfully) ముగియడంలో రెడ్ క్రాస్ పాత్ర కూడా ఉందన్నారు. ఇదే సేవాభావంతో భవిష్యత్తులో మరిన్ని ప్రజోపయోగ కార్యక్రమాలలో భాగస్వాములు కావాలని సూచించారు. ఉత్తమ సేవలు అందించిన రెడ్ క్రాస్ వాలంటీర్లకు జిల్లా కలెక్టర్ అభినందన పత్రాలు అందజేశారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖ వైద్యులు, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఎన్టీఆర్ జిల్లా చైర్మన్ డాక్టర్ జి. సమరం(Dr. G. Samaram) మాట్లాడుతూ.. జిల్లా కలెక్టర్ లక్ష్మీశ మార్గదర్శకత్వంలో అద్భుతంగా సేవలందించగలిగామని చెప్పారు. ఒక షిఫ్ట్ కు 20 మంది చొప్పున మూడు షిఫ్టుల్లో రోజుకు 60 మంది విద్యార్థులు అమ్మవారి భక్తులకు సేవలందించారని చెప్పారు. కేబీఎన్(KBN), పొట్టి శ్రీరాములు ఇంజనీరింగ్ కళాశాల, సిద్ధార్థ ఫార్మసీ కళాశాలల యూత్ రెడ్ క్రాస్ విభాగాల విద్యార్థులు ఈ ఉత్సవాలలో పాల్గొన్నట్టు తెలిపారు.

ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి ఇ.చిట్టిబాబు, సిద్ధార్థ ఫార్మసీ కళాశాల, కేబీఎన్ కళాశాల, పొట్టి శ్రీరాములు ఇంజనీరింగ్(Potti Sriramulu Engineering) కళాశాలల రెడ్ క్రాస్ యూత్ వింగ్ వాలంటీర్లు, సమన్వయకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply