ప్రజలకు సౌలభ్యంగా ప్రజావాణి కార్యక్రమం…

ప్రజలకు సౌలభ్యంగా ప్రజావాణి కార్యక్రమం…

జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్
మండల కేంద్రంలోదరఖాస్తుల స్వీకరణ

నిజాంపేట, ఆంధ్రప్రభ : ప్రజల దూర భారాన్ని, ప్రజల సమయాన్ని తగ్గించడం కోసమే మండల స్థాయిలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. సోమవారం నిజాంపేట మండలంలో మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ.. మండల కేంద్రాల్లో ప్రజావాణిని మరింత బలోపేతం చేస్తామని, ప్రజలదూర భారాన్ని, ప్రయాణ బత్యాల్ని, సమయాభావాన్ని తగ్గించడం కోసమే ఈ ప్రజావాణి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.

ప్రజావాణిలో ప్రజల నుండి వివిధ సమస్యలపై దరఖాస్తుల స్వీకరించినట్లు తెలిపారు. ఈ ప్రజావాణి కార్యక్రమంలో అన్ని సమస్యలు పరిష్కరించి,పరిష్కారం కాని వాటిని రాతపూర్వకంగా ఫిర్యాదుదారులకు అందించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులకు సూచించారు. భూ సమస్యలన్నీ పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. కోర్టు పరిధిలో పోలీసు పరిధిలో ఉన్న వాటిని సంబంధిత శాఖలకు పంపించాలన్నారు. వచ్చిన ప్రతి దరఖాస్తును ఆన్లైన్ చేసి వారం రోజుల్లో పరిష్కరిస్తామని తెలిపారు. ప్రజలు జిల్లా కార్యాలయాల చుట్టూ తీరవలసిన అవసరం లేకుండా మండల స్థాయిలోనే వారి సమస్యలకు పరిష్కారం దొరికేలా అధికారులు చర్యలు చేపట్టాలని సూచించారు.

నేటి నిజాంపేట ప్రజావాణి కార్యక్రమంలో భూ సమస్య అధికంగా ఉన్నందువల్ల వాటిని పరిష్కరిస్తామని పరిష్కరించని వాటిని రాతపూర్వక సమాధానం అందిస్తారని పేర్కొన్నారు. ప్రతి సోమవారం మండల స్థాయిలో ఉన్న అధికారులందరూ అది తూచా తప్పకుండా ప్రజావాణి కార్యక్రమంలో హాజర అవ్వాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తాహాసిల్దార్ శ్రీనీవాస్ ఎంపీడీవోరాజిరెడ్డి, డిప్యూటీ తాహసిల్దార్ రమ్యశ్రీ, ఆర్ ఐ ప్రీతి, మిషన్ భగీరథ ఏఈ బిక్షపతి, విద్యుత్ ఏఈ గణేష్,వ్యవసాయ అధికారి సోమలింగారెడ్డి, ఐసిడిసి లక్ష్మి,వెటర్నరీమౌనిక, పంచాయతీరాజ్ ఏఈశరత్, డాక్టర్ సాయి కృష్ణ, ఏపీఎం అశోక్,మండల స్థాయి అధికారులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply