Collector | నిర్లక్ష్యం చేస్తే సహించం.

Collector | నిర్లక్ష్యం చేస్తే సహించం.
Collector | రాయపోల్, ఆంధ్ర ప్రభ: జిల్లాలో విద్య,ఆరోగ్య రంగాల్లో నిర్లక్ష్యానికి తావులేదని జిల్లా కలెక్టర్ కె. హైమావతి హెచ్చరించారు. బుధవారం దౌల్తాబాద్, రాయపోల్ మండలాల్లో పాఠశాలలు,ఆరోగ్య కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసి సేవల అమలుపై కఠినంగా స్పందించారు. దొమ్మాట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించిన కలెక్టర్, కామన్ డైట్ మెనూను తప్పనిసరిగా పాటిస్తూ విద్యార్థులకు రుచికరంగా, పోషకాహారంతో భోజనం అందించాలని వంట సిబ్బందిని ఆదేశించారు. ప్రతి రోజు వంట ప్రక్రియను ఉపాధ్యాయులు పర్యవేక్షించాలని సూచించారు.
రాయపోల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఓపీ, అటెండెన్స్ రిజిస్టర్లను పరిశీలించి సిబ్బంది సమయపాలన పాటిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు.మెరుగైన వైద్య సేవలు అందించడంలో ఎలాంటి అలసత్వం ఉండకూడదని హెచ్చరించారు. కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో భోజన నాణ్యతను తనిఖీ చేసి, విద్యార్థుల హాజరు ప్రకారం సరుకులు సరఫరా చేసి భోజనం, వసతి విషయంలో ఎలాంటి కొరత లేకుండా చూడాలని ఉపాధ్యాయులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలోఎస్ హెచ్ఓ సుగందలత గ్రామ సర్పంచ్ మాసాన్ పల్లి రాజు,తదితరులు పాల్గొన్నారు.
