collector | త్వరలోనే సీబీజీ ప్లాంటు ప్రారంభం..

collector | త్వరలోనే సీబీజీ ప్లాంటు ప్రారంభం..
collector | కంచికచర్ల మండలం, పరిటాలలో ఏర్పాటుచేస్తున్న రిలయన్స్ న్యూ ఎనర్జీ – కంప్రెస్డ్ బయోగ్యాస్ (సీబీజీ) ప్లాంటును ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ బుధవారం సందర్శించారు. 30 ఎకరాల విస్తీర్ణంలోని ఈ ప్లాంటును త్వరలో ముఖ్యమంత్రి ప్రారంభించే అవకాశమున్నందున ప్లాంటులో జరుగుతున్న పనులను పరిశీలించారు. రోజుకు 22 టన్నుల సీబీజీ ఉత్పత్తి లక్ష్యంగా ప్లాంటును సిద్ధం చేస్తున్నట్లు ప్లాంటు సిబ్బంది వివరించారు.
స్థానిక వ్యవసాయ వ్యర్థాలు, మునిసిపల్ ఘన వ్యర్థాలు వంటి వాటిని ఉపయోగించి పర్యావరణ హిత ఇంధనాన్ని ఉత్పత్తి చేసేందుకు ఇలాంటి ప్లాంటులు దోహదం చేస్తాయన్నారు. ఉపాధి అవకాశాలను విస్తృతం చేసేందుకు, రైతుల ఆదాయాన్ని పెంచేందుకు కూడా చేయూతనిస్తాయన్నారు. కర్బన ఉద్గారాలకు కళ్లెం వేయడంతో పాటు రాష్ట్రాన్ని క్లీన్ ఎనర్జీ హబ్‌గా తీర్చిదిద్దే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం సీబీజీ ప్లాంట్లను పెద్దఎత్తున ప్రోత్సహిస్తోంది. కార్యక్రమంలో నందిగామ ఆర్డీవో కె.బాలకృష్ణ, సంస్థ డీజీఎం శ్రీకాంత్, మేనేజర్ శ్రీచరణ్, అసిస్టెంట్ మేనేజర్ చిట్టిబాబు ఉన్నారు.
