Collector | లేపాక్షి మహాశివరాత్రి ఉత్స‌వాల్లో….

Collector | లేపాక్షి మహాశివరాత్రి ఉత్స‌వాల్లో….

Collector | శ్రీ సత్యసాయి బ్యూరో, ఆంధ్రప్రభ : మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆదివారం శ్రీ సత్యసాయి జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం లేపాక్షి వీరభద్ర స్వామి ఆలయంలో ఉన్న నాగపడగ శివలింగం వద్ద ఘనంగా ఉత్సవాలు నిర్వహించబడ్డాయి. దేశ విదేశాల నుండి వచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసిపోయి భక్తిమయ వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎ. శ్యామ్ ప్రసాద్ ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.

ఆలయ అర్చకులు వేదమంత్రోచ్చారణల మధ్య మహాన్యాస పూర్వక రుద్రాభిషేకాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ భక్తిశ్రద్ధలతో స్వామివారికి అభిషేకం సమర్పించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మహాశివరాత్రి సందర్భంగా నిర్వహించిన పూజలు, అభిషేకాలు, అలంకరణలు భక్తులను ఆకట్టుకున్నాయి. నాగపడగ ఆకారంలో ఉన్న శివలింగం ప్రత్యేకతను దర్శించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో భక్తులకు అందిస్తున్న సౌకర్యాలను జిల్లా కలెక్టర్ పరిశీలించారు.

Collector |

తాగునీరు, పారిశుధ్యం, క్యూలైన్లు, భద్రతా ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించి అవసరమైన సూచనలు చేశారు. మహాశివరాత్రి ఉత్సవాలు శాంతియుతంగా, భక్తిపూర్వకంగా కొనసాగుతున్నందుకు సంతోషం వ్యక్తం చేస్తూ జిల్లా యంత్రాంగం తరఫున అన్ని ఏర్పాట్లు సమర్థంగా చేపట్టినట్లు తెలిపారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అప్రమత్తంగా పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సౌజన్య, దేవాదాయ శాఖ అధికారులు, ఆలయ ఈఓ, స్థానిక ప్రజాప్రతినిధులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. భారీ సంఖ్యలో భక్తులు పాల్గొని శివుని ఆశీస్సులు పొందారు. మహాశివరాత్రి సందర్భంగా లేపాక్షి ఆలయం ఆధ్యాత్మిక కాంతులతో వెలుగొందుతూ భక్తులకు ప్రత్యేక అనుభూతిని అందించింది.

Leave a Reply