Collector | పటిష్టమైన నిఘా..

Collector | పటిష్టమైన నిఘా..

  • జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్

Collector | శ్రీ సత్య సాయి బ్యూరో, ఆంధ్రప్రభ : శ్రీ సత్య సాయి జిల్లాకు సంబంధించి ఈవీఎంలను భద్రపరిచిన గోదాము వద్ద 24-7 ప్రకారం నిరంతరం పటిష్టమైన నిఘా ఉండాలని జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎన్నికల కమీషన్ ఆదేశాల మేరకు త్రైమాసిక తనిఖీల్లో భాగంగా….ఈ రోజు ధర్మవరం పట్టణం మార్కెట్ యార్డ్ లో ఉన్న ఈవీఎం గోదామును రాజకీయ పార్టీ ప్రతినిధులతో కలిసి కలెక్టర్ తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా రాజకీయ పార్టీల సమక్షంలో గోదాము లోపల భద్రపరిచిన ఆయా ఈవీఎం యంత్రాల బియులు, సియూలు, వివి ప్యాట్ లను, అక్కడి భద్రతా చర్యలను కలెక్టర్ క్షుణ్ణంగా పరిశీలన చేశారు. అనంతరం వివిధ అంశాలలో రాజకీయ పార్టీ ప్రతినిధులు అడిగిన సందేహాలకు కలెక్టర్ సమాధానం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ధర్మవరం ఆర్డీవో మహేష్, తహశీల్దార్, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply