Collector | విద్యుత్ ఆదాపై అవగాహన ర్యాలీ..

Collector | విద్యుత్ ఆదాపై అవగాహన ర్యాలీ..

  • విద్యుత్‌ను బాధ్యతగా వినియోగించుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత.
  • పాల్గొన్న ఉంగుటూరు ఎమ్మెల్యే ధర్మరాజు.

Collector | ఏలూరు కార్పొరేషన్, ఆంధ్రప్రభ : వారం రోజులపాటు నిర్వహించనున్న జాతీయ ఇందన పొదుపు వారోత్సవాలలో భాగంగా ఏలూరు జిల్లా కలెక్టరేట్ ఆవరణలో సోమవారం నాడు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో విద్యుత్ ఆదాపై నిర్వహించిన అవగాహన ర్యాలీలో జాయింట్ కలెక్టర్ తో కలిసి ఉంగుటూరు శాసనసభ్యులు పత్సమట్ల ధర్మరాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యుత్ చాలా విలువైనది విద్యుత్‌ను వృథా కాకుండా కాపాడుకుందాం అనే నినాదంతో నిర్వహించిన అవగాహన ర్యాలీని ఎమ్మెల్యే జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం కార్యక్రమానికి సంబంధించిన అవగాహన కరపత్రాలను ఆవిష్కరించారు.అనంతరం ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు మాట్లాడుతూ విద్యుత్ అనేది అమూల్యమైన వనరని దాని ఉత్పత్తికి సహజ వనరులు, భారీ వ్యయం అవసరమవుతాయని తెలిపారు. విద్యుత్‌ను బాధ్యతగా వినియోగించుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత అని పేర్కొన్నారు.

Collector

నేటి సత్ సంకల్పమే రేపటి వెలుగుల భవిష్యత్తుకు పునాది అవుతుందని తెలిపారు.ఇళ్లలో అవసరం లేని సమయంలో లైట్లు, ఫ్యాన్లు, ఇతర విద్యుత్ పరికరాలను ఆపివేయడం ద్వారా విద్యుత్ వినియోగాన్ని గణనీయంగా తగ్గించవచ్చని అన్నారు. శక్తి సామర్థ్యం కలిగిన పరికరాలు, ఎల్‌ఈడి బల్బులు వినియోగించడం ద్వారా విద్యుత్ ఆదాతో పాటు ఖర్చు కూడా తగ్గుతుందని చెప్పారు. విద్యుత్ ఆదా ద్వారా కేవలం ఆర్థిక లాభమే కాకుండా పర్యావరణ పరిరక్షణకు కూడా తోడ్పడుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.యువత, విద్యార్థులు ఈ ఉద్యమంలో ముందుండి ప్రజల్లో అవగాహన కల్పించాలని ప్రతి ఇంటి నుంచే విద్యుత్ ఆదా ప్రారంభం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిధిలోని విద్యుత్ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Leave a Reply