280 యూనిట్ల రక్తం సేకరణ

నర్సంపేట, ఆంధ్రప్రభ : రక్తదానం మరొకరికి ప్రాణదానం చేసినట్లు అవుతుందని వరంగల్ ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత కుమార్(East Zone DCP Ankita Kumar) అన్నారు. పోలీస్ అమరవీరుల పరచాలలో భాగంగా నర్సంపేట పట్టణంలోని సిటిజన్ క్లబ్ లో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిబిరాన్ని డీసీపీ ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయ‌న‌ మాట్లాడుతూ.. పోలీస్ అమరవీరుల వారోత్సవాలలో భాగంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరానికి యువకులు భారీగా తరలిరావడం ఆనందాన్ని ఇచ్చిందన్నారు. రక్తదాన శిబిరంలో సుమారు 280 యూనిట్ల రక్తాన్ని సేకరించి రెడ్క్రాస్(Red Cross) సంస్థకు అందజేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నర్సంపేట ఏసీపీ రవీందర్ రెడ్డి, సీఐ రఘుపతి రెడ్డి(CI Raghupathi Reddy), ఎస్సై అరుణ్ కుమార్‌లతోపాటు సబ్ డివిజన్ పోలీస్ అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply