- ఐదుగురు కార్మికుల దుర్మరణం..
రాయ్‌పూర్ : ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లోని సిల్తారా పరిశ్రమల ప్రాంతంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఇస్పాత్ లిమిటెడ్ స్టీల్ ప్లాంట్‌లో నిర్మాణ పనుల సమయంలో ఒక భాగం కుప్పకూలడంతో ఐదుగురు కార్మికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
అదే సమయంలో అక్కడ పనిచేస్తున్న పలువురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని వెంటనే స్థానిక ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. వారి పరిస్థితి గురించి ఇంకా స్పష్టత రాలేదు.
ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, జిల్లా అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. మృతుల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఈ ఘటనపై అధికార వర్గాలు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించాయి.