తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన చలిగాలులు..

తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన చలిగాలులు..
తెలంగాణ చలి తీవ్రత పెరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కనిష్ట ఉష్టోగ్రతలు నమోదు అవుతున్నాయి. రాత్రిపూట, తెల్లవారుజామున చలి గాలి తీవ్రత ఎక్కువైంది. మంచు కారణంగా వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో అతి తక్కువుగా 14.7 డిగ్రీలు నమోదు అయ్యింది. ఇక కొమరం భీమ్ ఆసిఫాబాద్, నిర్మల్, జాగిత్యాల, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్, నారాయణపేట, నాగర్ కర్నూల్, యాదాద్రి భువనగిరి, జనగామా, పెద్దపల్లి జిల్లాల్లో కూడా చలి తీవ్రత ఎక్కువైంది. అలాగే ఏపీలో పలు ప్రాంతాల్లో ఉష్టోగ్రతలు పడిపోయాయి.
